AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్‌ జాగ్రత్త

చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్‌ జాగ్రత్త

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 6:53 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. చిన్న పురుగు కుట్టడం వల్ల వచ్చే ఈ ఇన్ఫెక్షన్, నల్లని మచ్చలు, జ్వరం, ప్లేట్‌లెట్లు తగ్గడం వంటి లక్షణాలతో ప్రమాదకరంగా మారవచ్చు. సరైన సమయంలో యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే పూర్తిగా నయమవుతుంది. పరిశుభ్రత పాటించడం, ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా తీవ్ర పరిణామాలను నివారించవచ్చు.

ఏపీలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. 26 జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నప్పటికీ, సమయానికి చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా నయమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రారంభ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. స్క్రబ్ టైఫస్ అనేది చిన్నపాటి పురుగు కుడితే వచ్చే ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి. పురుగు కుట్టిన ప్రదేశంలో నల్లటి మచ్చ ఏర్పడటం, దద్దుర్లు రావడం, తరువాత జ్వరం, దగ్గు, తల నొప్పి, కీళ్ల నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్లెట్లు పడిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు పై ప్రభావం చూపుతుందంటున్నారు. వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణసమస్యల రూపంలో ఇన్‌ఫెక్షన్‌ బయటపడుతుంది. సకాలంలో చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు , మెదడు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. అన్ని జిల్లాల్లో ఈ కేసులున్నా.. చిత్తూరు , కాకినాడ , విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడగానే సాధారణ యాంటీబయాటిక్స్‌ వాడితే సమస్య దారికొస్తుంది. కానీ అవగాహన లేక, సకాలంలో గుర్తించక పోవడంతో సమస్య తీవ్రమవుతోంది. జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా, టైఫాయిడ్, డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్‌ టైఫస్‌ అనుమానిత ఎలిసా పరీక్ష చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదముందంటున్నారు. స్క్రబ్‌ టైఫస్‌ కీటకాల బెడద ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకకపోయినా, కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారని, తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాడుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరుబయట ఆటలాడే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చిన భర్త.. అలా ఎలా చేసావ్ భయ్యా

అమ్మవారి గుడికి వెళ్లిన భక్తులు..దెబ్బకి వెనక్కి పరుగు..

కోనసీమలో ఆకట్టుకుంటున్న గోవా బీచ్..

జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు మాయం

దేశంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్.. దిమ్మదిరిగే ఆస్తులకు ఓనర్