శుభకార్యాలకు లాంగ్ బ్రేక్..! శుక్ర మౌఢ్యమి నిజంగా అశుభ సమయమా..?
శుక్ర మౌఢ్యమి 2025 నవంబర్ 26న ప్రారంభమై 2026 ఫిబ్రవరి 7/17 వరకు 83 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో శుక్ర గ్రహం తన శక్తిని కోల్పోతుంది కాబట్టి వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు. నిత్యకర్మలు, కొన్ని వ్రతాలు చేయవచ్చు. ఇది ఫంక్షన్ హాళ్లు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
శుభకార్యాలకు లాంగ్ బ్రేక్ పడిందా? 83 రోజుల వరకు మంచి ముహూర్తాలు లేనట్టేనా? శుక్ర మౌడ్యమిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదా? అంటే పండితులు అవుననే అంటున్నారు. శుక్ర మౌఢ్యమి అంటే శుక్రుడు, సూర్యునికి చాలా దగ్గరగా ఉండి, శత్రుత్వమైన చీకటి లేదా శూన్య స్థితికి వచ్చే కాలం. 2025లో ఈ శుక్ర మౌఢ్యమి నవంబర్ 26న ప్రారంభమై 2026 ఫిబ్రవరి 7 లేదా 17 వరకు సుమారు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో శుక్ర గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అందువల్ల శుభకార్యాలకు అనుకూల కాలం కాదని పండితులు చెబుతారు. శుక్ర మౌడ్యమి సమయంలో పెళ్లి, గృహ ప్రవేశం, బోర్లు తవ్వడం, కొత్త వ్యాపారం మొదలైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి, గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే, సూర్యుడికి శుక్రుడికి మధ్య వక్రదిశలో 8 డిగ్రీల దూరం, సవ్య దిశలో 10 డిగ్రీల దూరం గనక ఉంటే మౌఢ్యమి వస్తుంది. సౌర కుటుంబానికి పెద్ద దిక్కు సూర్యుడు. ఆయన శక్తి, కాంతి అనంతం. గురు, శుక్రుడు శుభ గ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోతాయని, ఈ దశలో ఏవైనా శుభ కార్యక్రమాలు తలపెడితే..అవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే, నిత్యకర్మల వంటి పూజలు, కొన్ని ముఖ్య వ్రతాలు, అభిషేకాలు నిర్వహించవచ్చని పండితులు సూచిస్తున్నారు. 26 నవంబర్ 2025 నుంచి 7 లేదా 17 ఫిబ్రవరి 2026 వరకు శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. సుమారు 83 రోజులు శుభకార్యాలకు అనుకూల కాలం కాదని అని పండితుల సూచనగా ఉంది. శుక్రుడు సూర్యుని దగ్గర ఉండటం వలన తన శక్తి, ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర బలం తగ్గితే సంసార, సౌందర్య, సంపద విషయంలో హాని కలగవచ్చు. అందుకే మౌఢ్యమి సమయంలో పెళ్లిచూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహ నిర్మాణ పనిని మొదలుపెట్టటం, గృహప్రవేశం, యజ్ఞాలు, వధూప్రవేశం, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయనం, వాహనం కొనడం, బావి-చెరువులు- బోర్లు తవ్వడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాలను ఆరంభించడం, యాత్రలు, రాజ దర్శనము, రాజ్యాభిషేకం వంటివి చేయడం నిషిద్ధం.అయితే.. రోజువారీ ప్రయాణాలు, నిత్యారాధన, అభిషేకం, నవగ్రహ శాంతి, జప, హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాశన, పాత ఇంటి మరమ్మతులు, నూతన వస్త్రధారణ, చాతుర్మాస్య వ్రతాలు వంటివి మౌఢ్యమి రోజుల్లో నిరభ్యంతరంగా చేయొచ్చుని పండితులు వివరిస్తున్నారు. ఏటా మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ ఫుల్ బిజీగా ఉండేవి. కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి కారణంగా తమకు బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. వీరితో బాటు పెండ్లి డెకరేషన్లు చేసేవారి నుంచి బట్టలు, బంగారం షాపుల యజమానులు కూడా సుమారు 3 నెలల పాటు తమకు వ్యాపారం లేకుండా పోతోందని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం.. వృద్ధురాలని కూడా చూడకుండా నడి రోడ్డుపై ..
చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త
పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చిన భర్త.. అలా ఎలా చేసావ్ భయ్యా
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

