వీరికి సీతాఫలం విషంతో సమానం.. హెచ్చరిస్తున్న వైద్యులు
సీతాఫలం రుచి, ఆరోగ్య ప్రయోజనాలకు పేరు పొందినప్పటికీ, దీని అధిక సేవనం జీర్ణ సమస్యలు, అలర్జీలకు దారితీస్తుంది. ముఖ్యంగా అలర్జీలు, జీర్ణ లోపాలు, అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు సీతాఫలం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ పండులోని ఫైబర్, ఐరన్ అధిక మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి, వికారం వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త అవసరం.
వేసవికాలంలో మామిడిపండ్ల కోసం ఎంతగా ఎదురు చూస్తారో.. శీతాకాలంలో లభించే సీతాఫలాల కోసం కూడా అంతే వేచి చూసే వారు ఉంటారు. సీతాఫలాలు రుచిలోనే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. సీతాఫలాన్ని అమృత ఫలంగా పేర్కొంటారు. దీని రుచి మధురంగా ఉండటంతోపాటు.. దీనిలోని ఔషధగుణాలు పలు సమస్యలను నివారించేందుకు సహాయపడతాయి.. అయితే, సీతాఫలాన్ని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.. ఈ పండు తినడం ఎవరికి మంచిది కాదు.. దాని దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.. అలెర్జీలు ఉన్నవారు సీతాఫలం తినకపోవడమే మంచిది. కొంతమందికి సీతాఫలం తిన్న తర్వాత దురద, దద్దుర్లు, చికాకు లేదా ఇతర అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలం తినకూడదు. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, దానిని ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండును తినకపోవడమే మంచిది. సీతాఫలం ఐరన్ కు మంచి మూలం. అధికంగా తీసుకుంటే, అది శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతుంది.. ఇది కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్
గోవా ట్రిప్ పేరుతో క్యాసినోల్లో జూదం.. ఆస్తులు కుదువపెట్టి అప్పులపాలవుతున్న యువత
ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా దీనిలో..
శుభకార్యాలకు లాంగ్ బ్రేక్..! శుక్ర మౌఢ్యమి నిజంగా అశుభ సమయమా..?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

