Krishna District: మీరు కంచికచర్ల మీదుగా ప్రయాణం చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త !

మీరు కృష్ణాజిల్లా నందిగామ, కంచికచర్ల ప్రాంతాల గుండా  ప్రయాణం చేస్తున్నారా..?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

Krishna District: మీరు కంచికచర్ల మీదుగా ప్రయాణం చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త !
Robbery Batch
Follow us

|

Updated on: Dec 01, 2021 | 12:13 PM

మీరు కృష్ణాజిల్లా నందిగామ, కంచికచర్ల ప్రాంతాల గుండా  ప్రయాణం చేస్తున్నారా..?. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలన్నా, విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా ఇదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రూట్‌లో ట్రావెల్ చేస్తుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేస్తోంది. దారి దోపిడీలకు పాల్పడుతూ ప్రయాణీకులను నిలువు దోపిడి చేస్తున్నారు.  డబ్బు ఇవ్వకపోతే దాడులు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా  కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఆగి ఉన్న లారీలోకి ప్రవేశించి డ్రైవర్‌ను చితకబాది ఐదు వేలు నగదు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు ముగ్గురు యువకులు. డ్రైవర్ వదిలేయమని వేడుకున్న కనికరించలేదు. చేతి కడియంతో ముఖంపై పిడి గుద్దులు గుద్దారు. దగ్గర్లో ఉన్న వాటర్ ప్లాంట్‌కి చేరుకుని లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు గంటల వ్యవధిలోనే దోపిడీకి పాల్పడిన యువకులను పట్టుకున్నారు. కంచికచర్ల మోడల్ కాలనీ, ప్రణిత కాలనీకి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల పై కేసు నమోదు చేసిన పోలీసులు.

గతంలో వీరు గంజాయి సేవిస్తు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కంచికచర్ల ప్రాంతంలో యువకులు విచ్చలవిడిగా గంజాయి సేవనానికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. గంజాయిపై రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు.. కంచికచర్ల చుట్టుపక్కల ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. ఆకతాయిల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిస్టర్‌లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి.. ఎమోషనల్ ట్వీట్..