Sirivennela Sitaramasastri: సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి.. ఎమోషనల్ ట్వీట్..

సాహితీ సిరి దూరమైంది. వెన్నెల మటుమాయమైంది. సినీ జగత్తును ఓలలాడించిన లాలి పాట శాశ్వతంగా మూగబోయింది. సిరివెన్నెల శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

Sirivennela Sitaramasastri: సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి.. ఎమోషనల్ ట్వీట్..
Sirivennela Seetharama Sastry
Follow us

|

Updated on: Dec 01, 2021 | 9:04 AM

సాహితీ సిరి దూరమైంది. వెన్నెల మటుమాయమైంది. సినీ జగత్తును ఓలలాడించిన లాలి పాట శాశ్వతంగా మూగబోయింది. పాటైనా.. మాటైనా ప్రశ్నించడంలోనే తనను వెతుక్కుంటూ సమాజాన్ని జాగృతం చేస్తూ వచ్చిన ఓ సినీదిగ్గజం రాలిపోయింది. తిరిగిరాని లోకాలకు పోయింది. పాటై ప్రశ్నించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ మనల్ని నిద్రలేపుతూ ఆయన శాశ్వత నిద్రలోకి పోయారు. జగమంత తన కుటుంబాన్ని వదిలి.. సినీ అభిమానుల్ని ఏకాకులను చేసి ఆయన మాత్రం లోకాన్ని వీడారు. సిరివెన్నెల పాటలతో ఇంటిపేరు పెట్టుకున్నారు. సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. వేటూరిలా మెలోడీలతో ఆడించారు. శ్రీశ్రీ ను మరిపించేలా జాగృతం చేసే పాటలను అందించారు. సిరివెన్నెల పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత ఆయన.  3 దశాబ్ధాలు పాటల పూదోటలో ఒలలాడిన చిత్ర పరిశ్రమ..ఆయన మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ సిరివెన్నెల లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఆయన మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటంటూ చిన్నపిల్లల్లా తల్లిడిల్లిపోతున్నారు. ఓ తండ్రి లాండివారిని కోల్పోయామంటూ శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా గూగుల్ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది. “సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. Ok Google, play Sirivennela songs అంటూ ప్రజంట్ ట్రెండింగ్ సెర్చ్‌ను తన ట్వీట్‌కు జోడించింది.

Also Read: Sirivennela Sitaramasastri: కంటతడి పెట్టిస్తున్న సిరివెన్నెల చివరి ఫోన్ కాల్..

Latest Articles