Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మంగళవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మంగళవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక, బృహన్ మంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. బీఎంసీ అధికారుల సమాచారం మేరకు వర్లీలోని బిడిడి చాల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఆనంద్‌పూరి- విద్యాపూరి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల విష్ణు పూరి, నాలుగునెలల మంగేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్యాస్ లీక్ కావడం, ఇంటి తలుపులు, కిటీకీలు మూసి ఉంచడం, అదే సమయంలో ఇంట్లో లైట్ ఆన్ చేయడంతో మంటలు వ్యాపించాయి.
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, బీఎంసీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన నలుగురు కుటుంబ సభ్యులను వర్లీ సమీపంలోని పోదర్ ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత మెరుగైన చికిత్స కోసం నాయర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా వీరిలో ఆనంద్, నాలుగు నెలల మంగేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా నాయర్ ఆస్పత్రిలో చేరిన బాధితులు నొప్పితో విలపిస్తున్న సందర్భంలో ఒకరు సెల్‌ఫోన్‌లో వారిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. కాగా బాధితులను ఆస్పత్రిలో చేర్చుకోవడంపై జాప్యం జరిగిందని తెలుస్తోంది. దీనిపై హాస్పిటల్ డీన్ డాక్టర్ రమేశ్ భర్మల్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అదేవిధంగా గాయపడిన వారిని వీడియో తీసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Also read:
Hyderabd: చాదర్ ఘాట్ లో స్విఫ్ట్ బీభత్సం.. కారుతో పాటు మహిళ పోలీస్ స్టేషన్‌కు తరలింపు..