Kiran Abbavaram: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలో ఇద్దరు లెజెండ్స్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా ఓ యువ హీరో ఇంట విషాదం నెలకుంది.

Kiran Abbavaram: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం
Kiran Abbvaram
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2021 | 12:30 PM

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలో ఇద్దరు లెజెండ్స్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూయగా.. తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లంగ్ క్యాన్సర్‌తో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచారు. దీంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఓ యువ హీరో ఇంట ఊహించని విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌ యువ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు మృతి చెందాడు. ఆయన తమ్ముడు రామాంజులు రెడ్డి బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఫస్ట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇతడు హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ఓ సినిమా ఓపెనింగ్ అయింది. కెరీర్‌లో ఇప్పుడిప్పుడే మంచి స్థాయికి చేరుకుంటున్న కిరణ్‌కు సోదరుడి మరణం పెద్ద కుదుపుగానే చెప్పుకోవాలి.

Also Read: మీరు కంచికచర్ల మీదుగా ప్రయాణం చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త !

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిస్టర్‌లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?