Radhe Shyam Song: రాధేశ్యామ్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజువల్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..

Radhe Shyam New Song: ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న రాధే శ్యామ్‌ చిత్రం కోసం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అత్యం భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న..

Radhe Shyam Song: రాధేశ్యామ్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజువల్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..
Prabhas Radhe Shyam
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2021 | 12:59 PM

Aashiqui Aa Gayi Song: ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న రాధే శ్యామ్‌ చిత్రం కోసం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అత్యం భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్‌ రేంజ్‌, సినిమాపై ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు జాగ్రత్తతీసుకుంటున్నాడు దర్శకుడు రాధా కృష్ణ. ఇందులో భాగంగానే సినిమాను ఎక్కడ కంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాను వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సినిమా తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌ను పెంచే పనిలో పడింది.

ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అప్‌డేట్స్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఏంటన్నదానిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది. ఇక తాజాగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త చెబుతూ చిత్ర యూనిట్‌ మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాలో సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ పాట హిందీ వెర్షన్‌ను విడుదల చేశారు. ‘ఆషీకి ఆగయి’ అని సాగే ఈ పాట ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. ముఖ్యంగా ప్రభాస్‌, పూజాల మధ్య రొమాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఇక పాటను తెరకెక్కించిన లొకేషన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. విజువల్‌ వండర్‌గా ఈ పాటను తెరకెక్కించారు. ఈ పాట ప్రారంభంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సంభాషణ సినిమా కథ ఇదేనా అన్నట్లు ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి మీరూ ఓ సారి బ్యూటీఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌ను చూసేయండి.

Also Read: Viral Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిస్టర్‌లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

Redmi Note 11T 5G: భారత మార్కెట్లోకి రెడ్‌మీ కొత్త ఫోన్‌.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం..

Sirivennela Seetharama Sastry: పాటల మారాజు ఆఖరి ప్రయాణం.. కన్నీటి వీడ్కోలు శాస్త్రి గారు