AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Facebook Account: మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా..? ఇలా డిలీట్‌ చేయండి..!

Fake Facebook Account: ప్రస్తుతం ఫేస్‌బుక్‌ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇటీవల సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోయింది. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేస్తూ..

Fake Facebook Account: మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా..? ఇలా డిలీట్‌ చేయండి..!
Subhash Goud
|

Updated on: Dec 01, 2021 | 2:48 PM

Share

Fake Facebook Account: ప్రస్తుతం ఫేస్‌బుక్‌ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇటీవల సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోయింది. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ముఖ్యంగా నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లతో మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది సైబర్‌ నేరగాళ్లు మన పేరు మీదనే నకిలీ అకౌంట్‌ సృష్టించి మోసం చేస్తున్నారు. వాటి ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. వాళ్ల రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగానే అత్యవసరంగదా కొంత డబ్బు అవసరం ఉందని అడుగుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలా మంది డబ్బులు పంపిస్తూ మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. పోలీసులకు కూడా ఎన్నో ఫిర్యాదు కూడా అందాయి. దీంతో పోలీసులు కూడా అలాంటి ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను గుర్తించినప్పుడు పోలీసులకు తెలియకుండానే మనమే డిలీట్‌ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే మీకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండి, తర్వాత ఎక్కువగా ఉన్న అకౌంట్లను డిలీట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ ద్వారా ఆ అకౌంట్లను తొలగించుకోవచ్చు. అది ఎలాగోతెలుసుకుందాం.

► మీ పేరుపై నకిలీ ఖాతా కాగా, మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండి మిగతా ఖాతాలను డిలీట్‌ చేయాలని ముందుగా అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి.

► అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ప్రొఫైల్‌ ఫోటో కింద కుడివైపు మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి.

► ఆ తర్వాత find support or report profile ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

► అప్పుడు ఎందుకు రిపోర్ట్ చేస్తున్నామో కొన్ని కార‌ణాల‌ను తెరపై చూపిస్తుంది.

► వాటిలో ఫేక్‌ అకౌంట్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి రిపోర్టు ప్రక్రియను పూర్తి చేయాలి.

► మీరు మాత్రమే కాకుండా మీ మిత్రులు మరో 20 మందితో ఇదే విధంగా ఆ అకౌంట్‌పై రిపోర్టు చేయించాలి.

►అప్పుడు ఫేస్‌బుక్‌ దీనిని పరిశీలించి నకిలీ ఖాతా ఉన్నట్లు డిలీట్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!

Parag Agrawal: ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన అగర్వాల్‌ ట్వీట్‌.. చిన్నవయస్కుడైన సీఈవోగా రికార్డు

Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?