EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!

EPF Insurance:మీరు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) ఖాతా ఉన్న వారికి మంచి ప్రయోజనం ఉంది. అందులో ప్రతి నెల డబ్బులు జమ అవుతుంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్..

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 01, 2021 | 2:17 PM

EPF Insurance:మీరు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) ఖాతా ఉన్న వారికి మంచి ప్రయోజనం ఉంది. అందులో ప్రతి నెల డబ్బులు జమ అవుతుంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించే అన్ని బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. పీఎఫ్‌ ఉన్నవారు ఇలాంటి విషయాలను తెలుసుకోవడం మంచిది. కొన్ని స్కీమ్‌లకు చాలా బెనిఫిట్స్‌ ఉంటాయి. కానీ అవి అందరికి తెలియకపోవడంతో ఈ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. ఈ పీఎఫ్‌ బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కూడా ఉంది. ఈ పథకం ద్వారా ఎంప్లాయీస్‌ కుటుంబానికి రూ.7 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇన్స్యూరెన్స్ స్కీమ్. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరూ ఈ స్కీమ్‌లో కవర్ అవుతారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు రూ.7 లక్షల బీమా వర్తిస్తుంది.

ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగిస్తున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల బీమా అందుతుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా ఈ బీమా ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు ఇ-నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్‌లో నమోదు చేయాలి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాలు ఎంటర్ చేయవచ్చు. ఈపీఎఫ్ మెంబర్స్ అందరూ ఇ-నామినేషన్ ఫైల్ చేసి తమ కుటుంబాలకు సామాజిక భద్రత అందించాలని ఈపీఎఫ్ఓ కూడా కోరుతోంది. ఈపీఎఫ్ లేదా ఈపీఎస్ నామినేషన్ డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయాలని కోరుతోంది.

ఇ-నామినేషన్ చేయడం ఎలా..?

ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి. సర్వీస్‌ (Services) పైన క్లిక్ చేయాలి. అందులో ఫర్‌ ఎంప్లాయీస్‌ (For Employees) సెక్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు Member UAN/Online Service ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మెంబర్ ఇ-సేవా పోర్టల్ ఓపెన్ తర్వాత ఉద్యోగులు యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Manage ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో E-Nomination సెలెక్ట్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేయాలి. మీ నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారి వివరాలు ఎంటర్ చేయాలి. Add Family Details క్లిక్ చేసి పేర్లు, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఒకరు లేదా ఒకరి కన్నా ఎక్కువమంది పేర్లు ఎంటర్ చేయవచ్చు. అయితే ఒకరికంటే ఎక్కువ మంది పేర్లు ఉంటే ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా వివరించవచ్చు.

ఇక వివరాలన్నీ ఓసారి సరిచూసుకున్న తర్వాత Save EPF Nomination పైన క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో E-sign ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్ టైమ్ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

కాగా, గతంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బీమా లభించేది. అయితే ఏప్రిల్‌ 28, 2021న ఈ స్కీమ్ బెనిఫిట్‌ను పెంచింది ఈపీఎఫ్ఓ. కనీసం రూ.2.50 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Post Office scheme: అద్భుతమైన స్కీమ్‌.. రూ.1000 పెట్టుబడితో ప్రారంభించి రూ.14 లక్షలు వరకు సంపాదించుకోండి

Auto-Rickshaw: సామాన్య ప్రజలకు మరో షాక్‌ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక ఆటో ఎక్కితే జీఎస్టీ చెల్లించాల్సిందే..!

Liquor Consumption: మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం ముందుంది.. మరి తెలంగాణ.. తాజా సర్వేలో సంచలన విషయాలు..!