Petrol Price: పెట్రోల్ ధరలపై ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. లీటర్‌కు రూ.8 తగ్గింపు.. ఎప్పటి నుంచి అమలు అంటే?
Petrol Diesel Rates: పెట్రోల్ ధరలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Delhi Govt reduces VAT on petrol: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8 తగ్గనుంది. కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.
Delhi Govt reduces VAT on petrol to 19.40% from 30%, petrol price to reduce by Rs 8 per litre, new rates to come in to effect from midnight today pic.twitter.com/BV0chqRj5V
— ANI (@ANI) December 1, 2021
ఢిల్లీ ప్రభుత్వం బుధవారం పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరల లీటరుకు రూ. 8 తగ్గుతాయి. కొత్త ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోవైపు, వరుసగా 27 రోజుల పాటు ఇంధన ధరలు యథాతథంగా కొనసాగాయి. అంతకుముందు నవంబర్ 4న, ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇక దశలో రికార్డు స్థాయిలో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చింది.
మెట్రో నగరాల్లో ముంబైలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా VAT కారణంగా రాష్ట్రాలలో రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.97కి విక్రయిస్తుండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం డీజిల్ ధర రూ. 86.67గా ఉంది. ముంబైలో, పెట్రోల్ లీటరుకు రూ.109.98 వద్ద కొనసాగుతోంది. డీజిల్‌ను లీటరుకు రూ.94.14 చొప్పున విక్రయిస్తున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి.
ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా, చమురు ధరలు 2 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. గత సెషన్ నుండి కొంత నష్టాలను తిరిగి పొందాయి. ప్రధాన ఉత్పత్తిదారులు Omicron వేరియంట్ నుండి ఇంధన డిమాండ్‌కు దెబ్బతినే ముప్పుపై ఎలా స్పందించాలో చర్చించడానికి సిద్ధమయ్యారు. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మంగళవారం 3.9 శాతం క్షీణత తర్వాత బ్యారెల్‌కు 1.90 డాలర్లు లేదా 2.7 శాతం పెరిగి 71.13 డాలర్లకు చేరుకుంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ మంగళవారం నాడు 5.4 శాతం పడిపోయిన తర్వాత బ్యారెల్‌కు $1.71 లేదా 2.6 శాతం పెరిగి $67.89కి చేరుకుంది.
Read Also… Kiran Abbavaram: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం