PMFBY Scheme: రైతులకు ముఖ్య సూచన.. డిసెంబరు 31లోపు పంట బీమా చేయించుకోండి.. లేకుంటే ఈ ప్రయోజనం పొందలేరు!
Madhya Pradesh Minister Kamal Patel: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద డిసెంబర్ 31, 2021 లోపు రబీ సీజన్ పంటలకు బీమా చేయించాలని మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి కమల్ పటేల్ రైతులకు విజ్ఞప్తి చేశారు.

Madhya Pradesh Minister on PMFBY Scheme: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద డిసెంబర్ 31, 2021 లోపు రబీ సీజన్ పంటలకు బీమా చేయించాలని మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి కమల్ పటేల్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఇదే చివరి తేదీ అని ఆయన వెల్లడించారు. దీని తర్వాత బీమా ప్రయోజనం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో అటవీ గ్రామాల్లో పంటల బీమా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ అటవీ భూమి ఉంటే అక్కడ కూడా బీమా కల్పిస్తామని వ్యవసాయ మంత్రి తెలిపారు. గతంలో బ్యాంకులో కెసిసి ఉన్నవారు బీమా చేయించుకుంటారు కానీ కెసిసి లేనివారు ఇప్పుడు కూడా బీమా చేసుకోవచ్చు.
బ్యాంకుకు వెళ్లి సహకార సంఘంలో పంటల బీమా పొందాలని వ్యవసాయ మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇది రైతులకు నష్ట భయాలను, ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. డిఫాల్టర్ రైతులు కూడా బీమా పొందవచ్చు. వారికి కూడా 1.5% ప్రీమియంతో మాత్రమే బీమా చేయడం జరుగుతుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. మంగళవారం భూపాల్ నుంచి రబీ పంటల బీమా పథకంలో బీమా పొందేందుకు ప్రజావాణి రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పప్పుధాన్యాలు, ఇతర పంటలకు తప్పనిసరిగా బీమా చేయించాలని పటేల్ చెప్పారు.
ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద 2020-21 సంవత్సరానికి రబీ పంటలకు గరిష్ట బీమా పొందడానికి 52 ప్రచార కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని పటేల్ చెప్పారు. డిసెంబర్ 30 నాటికి రాష్ట్రంలోని మరిన్ని గ్రామాలకు ప్రచార రథాలు చేరుకుని రైతులకు అవగాహన కల్పిస్తాయి. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 40 జిల్లాల్లో, హెచ్‌డిఎఫ్‌సి ద్వారా 10 జిల్లాల్లో, రిలయన్స్ కంపెనీ 2 జిల్లాల్లో ప్రమోట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో రథం ద్వారా రోజుకు 4 నుంచి 5 గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయ మంత్రి తెలిపారు. ప్రచారం సందర్భంగా దాదాపు 5 వేల కిసాన్ చౌపల్స్ నిర్వహించనున్నారు. పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేస్తామన్నారు.
ఇదిలావుంటే, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు అవగాహన కల్పించడానికి, వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి రబీ సీజన్ 2021-22 మొదటి వారాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వీక్‌గా జరుపుకుంటారు. ఇది బుధవారం నుండి ప్రారంభమైంది. పంట నష్టం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2016 జనవరి 13న ప్రారంభించారు. రైతులు ప్రీమియంగా చెల్లించిన ప్రతి రూ.100కి రికార్డు స్థాయిలో రూ.537 క్లెయిమ్‌ను అందుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. డిసెంబర్-2020 వరకు రైతులు రూ.19 వేల కోట్ల బీమా ప్రీమియం చెల్లించారని, దానికి ప్రతిఫలంగా దాదాపు 90 వేల కోట్ల రూపాయల క్లెయిమ్‌ను రైతులు పొందారని ప్రభుత్వం పేర్కొంది.
Read Also… State Bank of India: 10వేల కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేస్తున్నారా.. ఇకపై కొత్త రూల్ తప్పనిసరి!