AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లాక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

గతంలో కేవలం బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ మాత్రమే పోలీస్ డాగ్స్ సాయం తీసుకునేవి. కానీ ఇప్పుడు దాదాపుగా భారత్‌లోని అన్ని బలగాలు శునకాల సేవలను వినియోగించుకుంటున్నాయి. క్రైమ్ జరగకుండా ఆపడం, క్రైమ్ చేసిన నిందితులను పట్టుకోవడంలో శిక్షణ ఇచ్చిన శునకాలు.. తమ మార్క్ చూపిస్తున్నాయి.

Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లాక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
Vijayawada Railway Station
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2025 | 3:18 PM

Share

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు.. శిక్షణ ఇచ్చిన డాగ్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ గుట్టు విప్పడంలో బాగా సహాయపడుతున్నాయి.  ఏదైనా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, డ్రగ్స్ రవాణా.. ఇతర క్రైమ్స్ జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్నిపర్ డాగ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రకృతి ప్రకోపాల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు, మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సైతం.. ఈ డాగ్స్ గొప్ప సాయం చేస్తున్నాయి.

తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో లియో అనే పేరు గల శునకం పెద్ద మొత్తంలో సొత్తు ఉన్న అనుమానాస్పద బ్యాగును పోలీసులకు పట్టించింది. ఈ తనిఖీల్లో బ్యాగులో క్యాష్, బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్‌ పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ జేవీ రమణ, ఆర్పీఎఫ్‌ సీఐ అలీబేగ్‌ సిబ్బందితో మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే 1వ నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న పాసింజర్స్ సామాన్లు భద్రపరుచుకునే గదిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక అనుమానిత బ్యాగును పసిగట్టిన శునకం లియో అక్కడే ఆగిపోయింది. దీన్ని గమనించిన పోలీసులు ఆ బ్యాగును ఓపెన్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బ్యాగును తనిఖీ చేసిన రైల్వే పోలీసులకు లోపల రూ.9.70 లక్షల డబ్బు, గోల్డ్, వెండి వస్తువులు కనిపించాయి. వెంటనే సంబంధిత సిబ్బందిని పిలిచి బ్యాగు ఎవరిదని వారు ప్రశ్నించగా..  ఏప్రిల్ 10వ తేదీ నుంచి బ్యాగు ఇక్కడే ఉందని, పెట్టిన వారు పూర్తి వివరాలు తెలియజేయలేదని వారు సమాధానమిచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును నిర్వహిస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..