AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

440కి 434 మార్కులొచ్చాయనీ.. బోరుబోరున ఏడ్చిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ బాలిక! వీడియో

కొంతమంది అమ్మాయిలు చేసే పనులు బలే నవ్వు తెప్పిస్తాయి. సాధారణంగా పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతి సంవత్సరం అమ్మాయిలే టాపర్లుగా నిలుస్తుంటారు. ఈ ఏడాది వచ్చిన ఫలితాల్లోనూ ఇదే అనవాయితీ కొనసాగింది. అయితే మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ అమ్మాయికి టాప్ మార్కులు వచ్చాయి. అయినా ఆమెకు సంతోషం లేదు. కేవలం 6 మార్కులు తగ్గాయని బోరున ఏడ్వడం ప్రారంభించింది..

440కి 434 మార్కులొచ్చాయనీ.. బోరుబోరున ఏడ్చిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ బాలిక! వీడియో
Girl Crying After She Got 434 Out Of 440 Marks
Srilakshmi C
|

Updated on: Apr 23, 2025 | 1:49 PM

Share

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2025 ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అమ్మాయిలు అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించి విజయఢంకా మోగించారు. మొత్తం ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌లు 73.83 శాతం, 74.21 శాతం చొప్పున గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు.

అయితే ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో ఓ విద్యార్ధినికి బైపీసీ గ్రూపులో 440 మార్కులకు గానూ ఏకంగా 434 మార్కులు వచ్చాయి. అంటే కేవలం 6 మార్కులు మాత్రమే తగ్గాయన్నమాట. ఇన్ని మార్కులు వేరెవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ విద్యార్ధిని మాత్రం మార్కులు చూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఫోన్‌ వచ్చిన మార్కులను చూసుకుంటూ బోరున ఏడుస్తున్న సదరు అమ్మాయి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

దీంతో పక్కనే ఉన్న తల్లి 434 మార్కులు చాలా ఎక్కువ. 6 మార్కులే తగ్గాయి.. నువ్వు బాగానే పరీక్షలు రాశావని ఎంతగా ఓదారుస్తున్న సదరు బాలిక ఏడుపు మానలేదు. ఓవైపు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే రోడ్డెక్కి కాలర్‌ ఎగరేసి తిరుగుతుంటే.. టాప్‌ మార్కులు తెచ్చుకున్న ఈ అమ్మాయి మాత్రం ఇలా బోరుబోరున ఏడ్వడం చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..? ఇన్ని మార్కులొస్తే మీరైతే ఏం చేస్తారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.