AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ ఇదెక్కడి లొల్లిరా సామీ..! ఆటపట్టించారని.. పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నారు..

ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లింది. పెళ్లి కొడుకు తరపు వారు రెచ్చిపోయి తమ కోసం బుక్ చేసిన హోటల్‌ను కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు.

Watch: వార్నీ ఇదెక్కడి లొల్లిరా సామీ..! ఆటపట్టించారని.. పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్నారు..
Wedding
Jyothi Gadda
|

Updated on: Apr 23, 2025 | 3:17 PM

Share

పెళ్లిలోని సంతోషకరమైన వాతావరణంలో అకస్మాత్తుగా తీవ్ర గందరగోళం చెలరేగింది. వధువు వేదికపై కూర్చుని వరుడి కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తోంది. అనంతలోనే పెళ్లి మండపంలో ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. వధూవరుల తరపు వ్యక్తుల మధ్య వాగ్వాదం తీవ్ర పోరాటానికి దారితీసింది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు గాయపడ్డారు. రెండు వర్గాల మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. చివరకు పెళ్లినే క్యాన్సిల్‌ చేసుకున్నారు వధువు కుటుంబీకులు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుక రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ తీవ్ర హింసకు దారితీసింది. చివరకు ఈ ఘర్షణ విషాదకరమైన దృశ్యంగా మారింది. పెళ్లిలో భాగంగా రాంపూర్ నుండి బహదరాబాద్ వరకు వివాహ ఊరేగింపును స్వాగతిస్తున్నప్పుడు, రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అది చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. అబ్బాయిలు.. అమ్మాయిలను ఆటపట్టించారనే ఆరోపణతో వధువు కుటుంబీకులు గొడవకు దిగారు.

ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లింది. పెళ్లి కొడుకు తరపు వారు రెచ్చిపోయి తమ కోసం బుక్ చేసిన హోటల్‌ను కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కానీ ఈ సంఘటన సంతోషకరమైన పవిత్రమైన పెళ్లి మండపం హింసాత్మకంగా మారటం అందరిని దిగ్భ్రంతికి గురిచేసింది. చివరకు వధువు కుటుంబీకులు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..