Viral: కొండెక్కిన కోరికలు.. కంగారులో ప్రైవేట్ పార్టులోకి.. ఆపై ఎక్సరే తీయగా..
కోరికలు అందరిలోనూ ఉంటాయి. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం.. ఆపై సంతృప్తి కోసం ఎలాంటి చిత్రవిచిత్రమైన పనులు చేయకపోవడమే మంచిది. కానీ ఇక్కడ యూకేలోని ఓ 14 ఏళ్ల బాలుడు స్వీయసంతృప్తి కోసం.. ఏం చేశాడో తెలిస్తే.. ఆ వివరాలు ఇలా..

ఆ ఫీలింగ్స్ అనేవి అందరిలోనూ కామనే. పిల్లల నుంచి పెద్దల వరకు వీటికి దాసోహం అవ్వాల్సిందే. వయస్సు రిత్యా వచ్చే మార్పులతో కొందరికి కోరికలు గుర్రాలవుతున్నాయి. ఈ తరుణంలో తమ సంతృప్తిని తీర్చుకునేందుకు చాలామంది చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఇక ఇలాంటి అరుదైన కేసులు చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. మన దేశంలో ఈ కేసుల గురించి అప్పుడప్పుడూ చూసినా.. విదేశాల్లో ఇలాంటివి చాలా కామన్. ఒక్క యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే సుమారు 10 ఏళ్లలోనే 3500 ఫారిన్ అబ్జెక్ట్‌లను శరీరంలో నుంచి బయటకు తీశారు డాక్టర్లు. ఈ విషయంపై పలువురు డాక్టర్లు తమ జర్నల్‌లో పేర్కొంటూ ఓ 14 ఏళ్ల బాలుడి కేసును నెటిజన్లకు వివరించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 14 ఏళ్ల బాలుడు స్వీయసంతృప్తి కోసం తన మలద్వారంలోకి సుమారు 18 సెంటీమీటర్ల పొడువున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌ను మలద్వారంలోకి జొప్పించుకున్నాడు. అది కూడా ఖాళీ బాటిల్ కాదు.. ఫుల్‌గా లిక్విడ్ ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ అని డాక్టర్లు జర్నల్‌లో పేర్కొన్నారు. 36 గంటలు గడిచినా ఆ బాలుడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అయితే సాధారణ పరీక్షల నిమిత్తం ఆ తర్వాత బాలుడు స్థానిక ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. నార్మల్ టెస్టులలో ఎలాంటి ప్రతికూల సంకేతాలు డాక్టర్లు గురించలేదు. అయితే సాధారణ ఉదర రేడియోగ్రాఫీలో మలద్వారం వద్ద పెద్ద ఓవల్ షేప్డ్ వస్తువు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు.
ఆ వస్తువును అనస్థీషియా ఇచ్చి కొలొనోస్కోప్‌తో మ్యానువల్‌గా తీయాలని డాక్టర్లు తొలుత భావించారు. మలద్వారం నుంచి 30 సెం.మీ పైన ఆ గాజు సీసా ఇరుక్కున్నట్టు గుర్తించారు. దాన్ని తీసేందుకు ప్రయత్నించినా.. విఫలమవుతూనే వచ్చారు. ఆ సీసా పెద్ద పేగుల దగ్గర ఇరుక్కుపోవడంతో.. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా రాలేదు. ఇక ఆ తర్వాత సదరు బాలుడికి ఎక్స్ప్లోరేటరీ లాపరోటమీ(Exploratory laparotomy) చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో పురషనాళం గుండా ఆ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను పెద్ద పేగులకు ఎలాంటి బ్రేకేజ్ కలగకుండా బయటకు తీశారు. ఇక ఆపై రోగి రెండు లేదా మూడు రోజులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కాగా, ఇలాంటి కేసులు యూకేలో బాగా పెరిగాయని డాక్టర్లు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ ద్వారా అడల్ట్ సైట్‌ల సెర్చింగ్ ఎక్కువ అయిపోవడమే ఇందుకు కారణం అని డాక్టర్లు అన్నారు. అలాగే పురషనాళంలోకి చొప్పించిన వస్తువులలో మసాజ్ పరికరాలు, వైబ్రేటర్లు, పెన్నులు, పెన్సిళ్లు, తాళ్లు, తీగలు, సీసాలు, గాజు వస్తువులు, లస్ బ్యాటరీలు ఉన్నాయని అన్నారు.
