IRCTC Tour : రాజస్థాన్ అందాలను చూడాలనుకుంటున్నారా.. అయితే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసమే..
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం 'ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)' ఐఆర్‌సీటీసీ టూరిజం పేరుతో వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)’ ఐఆర్‌సీటీసీ టూరిజం పేరుతో వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల నుంచి దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని థార్ ఎడారితో పాటు ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ‘రాజస్థాన్ డెజెర్ట్ సర్క్యూట్’ పేరుతో మరొక ట్యూర్ ప్యాకేజీ ప్రకటించింది.
వచ్చే ఏడాది జనవరి 20న విశాఖపట్నం నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. కాగా ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.33, 215. టూర్‌లో భాగంగా రాజస్థాన్ రాజధాని జైపూర్ అందాలతో పాటు జైసల్మీర్, బికనీర్, జోధ్‌పూర్..తదితర ప్రాంతాలను చూడొచ్చు. మొత్తం 7 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అడ్వాన్స్ బుకింగ్, ఇతర వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అదేవిధంగా 8287932318, 8287932322 నంబర్లను సంప్రదించవచ్చు.
Discover the old-world charm of #Rajasthan & enjoy a quintessential family holiday with our 7D/6N ‘Rajasthan Desert Circuit’ tour package starting at just Rs.33,215/-pp*. #Booking & #details on https://t.co/nCfso1ok0B *T&C Apply
— IRCTC (@IRCTCofficial) November 29, 2021
Also Read:
Kiran Abbavaram: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం