AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cop Change Gender: మహిళా పోలీసు కానిస్టేబుల్ లింగ మార్పిడికి అనుమతి.. ఆ రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం!

లింగ మార్పిడి తర్వాత కూడ ఉద్యోగంలో కొనసాగేందుకు మహిళా కానిస్టేబుల్స్ అభ్యర్థనను మధ్యప్రదేశ్ పోలీసు శాఖ అనుమతినిచ్చింది.

Cop Change Gender: మహిళా పోలీసు కానిస్టేబుల్ లింగ మార్పిడికి అనుమతి.. ఆ రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం!
Police
Balaraju Goud
|

Updated on: Dec 01, 2021 | 1:21 PM

Share

Madhya Pradesh Female Constable to Change Gender: లింగ మార్పిడి తర్వాత కూడ ఉద్యోగంలో కొనసాగేందుకు మహిళా కానిస్టేబుల్స్ అభ్యర్థనను మధ్యప్రదేశ్ పోలీసు శాఖ అనుమతినిచ్చింది. మహిళా కానిస్టేబుల్ అమిత (పేరు మార్చాం) లింగాన్ని మార్చుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనుమతి ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో లింగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలి కేసు అని రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రాజౌరా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హోంశాఖ బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.

మహిళా కానిస్టేబుల్‌కు చిన్నప్పటి నుంచి జెండర్‌ ఐడెంటిటీ డిజార్డర్‌ సమస్య ఉందని, జాతీయ స్థాయి సైకియాట్రిస్టులు కూడా దీనిని ధృవీకరించారని ఆయన చెప్పారు. 2019లో గెజిట్ ఆఫ్ ఇండియాలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా ఆఫిడవిట్ సమర్పిస్తూ సదరు మహిళా కానిస్టేబుల్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష అనంతంర కీలక నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనుమతి కోసం హోం శాఖ నుంచి గైడెన్స్ తీసుకుంది. డాక్టర్ రాజూర మాట్లాడుతూ.. దేశంలో ఏ పౌరుడైనా తన మతం, కులంతో సంబంధం లేకుండా తన లింగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ఇందులోభాగంగా లా డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించి.. హోం శాఖ తరపున పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అనుమతి లభించిందన్నారు.

మహారాష్ట్రలో తొలి కేసు… 5 సంవత్సరాల క్రితం, బీడ్‌కు చెందిన 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ లింగాన్ని మార్చుకోవడానికి అనుమతి కోరింది. దేశంలో ఇదే తొలి కేసు. అన్ని చట్టపరమైన అడ్డంకులను తొలగించిన తర్వాత, అతని లింక్ మార్పు సాధ్యమైంది. ఈ చట్టపరమైన ప్రక్రియ అతనికి రెండు-మూడేళ్లు పట్టింది. లింగ మార్పిడికి అనుమతించాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్‌ దాఖలు చేసుకున్న అభ్యర్థనను తొలుత మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు ఔరంగబాద్‌ ఐజీపీ రాజ్‌కుమార్‌ వాట్కర్‌ ఆమెకు లేఖ రాశారు. అనంతరం హైకోర్టు అనుమతితో ఆమె అభ్యర్థనను మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ మన్నించింది.

విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు)పై విచారణకు ఆదేశించిన మరుసటి రోజే మధ్యప్రదేశ్ హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం మాట్లాడుతూ.. మత మార్పిడి కార్యకలాపాలకు పాల్పడుతున్న పాపులర్ ఫ్రంట్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలని.. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. PFI, ఇతర NGOల ద్వారా విదేశీ నిధుల వినియోగం పెరిగిందన్నారు. మందుకు మందు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, విదేశీ నిధులు పొందుతున్న NGOలతో పాటు సమాజంలో శత్రుత్వాన్ని వ్యాప్తి చేసి మత మార్పిడికి పాల్పడే వారిపై దర్యాప్తు చేయాలని పోలీసు శాఖతో పాటు స్థానిక పరిపాలన వ్యవస్థలను ఆదేశించారు.

Read Also… Petrol Price: పెట్రోల్ ధరలపై ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. లీటర్‌కు రూ.8 తగ్గింపు.. ఎప్పటి నుంచి అమలు అంటే?