Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు ‘భారత్‌ గౌరవ్‌ స్కీమ్‌’

Indian Railway: భారత రైల్వే శాఖ ప్రయాణికుల ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పర్యాటక..

Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు 'భారత్‌ గౌరవ్‌ స్కీమ్‌'
Bharat Gaurav Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Dec 01, 2021 | 3:20 PM

Indian Railway: భారత రైల్వే శాఖ ప్రయాణికుల ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పర్యాటక రంగ వ్యాపారాన్ని, పర్యటకులను ఆకర్షించడానికి భారత రైల్వే శాఖ మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. నవంబర్‌ 23న భారత్‌ గౌరవ్‌ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో ప్రైవేటు టూర్‌ ఆపరేటర్లు రైల్వే శాఖ నుంచి రైళ్లను లీజుకు తీసుకోవచ్చు. భారతదేశం గొప్పతనం, సాంస్కృతి వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఈ భారత్‌ గౌరవ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. ప్రయాణం కోసం రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్దంగా ఉందని ఈస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ అరోరా తెలిపారు. ఇది రైల్వే ప్రైవేటీకరణ కాదని, దీని వల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే చోట అన్ని సౌకర్యాలు అందించేందుకు ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఈ స్కీమ్‌లో అద్దెకు తీసుకునే రైళ్లు తమకు నచ్చిన రూట్లలో నడుపుకోవచ్చు. అలాగే ప్రైవేటు ఆపరేటర్లు రూట్‌ ఛార్జీలు, ఇతర సేవలు, రూట్లు నిర్ణయించుకునే హక్కు ఉంటుందన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా అద్దెకు తీసుకునే ప్రైవేటు ఆపరేటర్లకు అరేంజ్‌మెంట్‌ గడువు కనీసం రెండేళ్లు ఉంఉటంది. గరిష్టంగా కోచ్‌ కోడల్‌ లైఫ్‌ వ్యవధి వరకు ఉంటుందని తెలిపారు.

కాగా, ఐఆర్‌సీటీసీ సైతం పర్యాటక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే రామాయణ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రాముడి జీవిత విశేషాలతో అనుసంధానమైన అనేక ప్రదేశాలలో ఈ రైలును నడుపుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ భాగంగా రైలు ప్రయాణం, వసతి, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వంటివి ఉంటాయి. కొత్త బోగీలను కూడా ఆపరేటర్‌ అద్దెకు తీసుకోవచ్చు. రైల్వే ప్రమాణాల ప్రకారం.. రైలు డిజైన్‌, ఇంటీరియల్‌ డెకరేషన్‌ వంటి వాటికి అనుమతి ఉంటుంది. అయితే దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 180 కంటే ఎక్కువ రైళ్లను నడపడానికి సిద్ధంగా ఉంది రైల్వే శాఖ. భారత్‌ గౌరవ్‌ పాలసీ ప్రకారం.. ప్రొఫెషనల్‌ టూర్‌ ఆపరేటర్లు టూరిస్ట్‌ రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుందని ఈస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ అరోరా తెలిపారు. ఇందులోభాగంగా 3వేలకుపైగా కోచ్‌లను సిద్ధం చేసింది రైల్వే శాఖ. ఈ రైళ్లకు ప్రభుత్వం నిర్ణీత ఛార్జీలను నిర్ణయిస్తుంది.a

ఇవి కూడా చదవండి:

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!

IRCTC: మీరు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..