Viral News: వామ్మో.. ఇదేం పిచ్చి! మాజీ ప్రియుడి కోసం ప్రియురాలు ఎంత పని చేసింది.. చివరికి.!

ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న విషయాలకే తమ ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలా విడిపోయిన...

Viral News: వామ్మో.. ఇదేం పిచ్చి! మాజీ ప్రియుడి కోసం ప్రియురాలు ఎంత పని చేసింది.. చివరికి.!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 01, 2021 | 9:28 PM

ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న విషయాలకే తమ ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలా విడిపోయిన కొన్నాళ్లకు మాజీ ప్రేమికుడు/ప్రేమికురాలిని మర్చిపోలేక విరహవేదనను అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే వారి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. బ్రిటన్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన మాజీ ప్రేమికుడికి దగ్గరయ్యేందుకు ఎవరూ ఊహించనటువంటి పని చేసింది. మొదటిగా మీరు ఆమె చెప్పిన కథ విన్నప్పుడు.. ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు.. కానీ ఆమె మూర్ఖత్వానికి జాలిపడతారు. అసలు ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

బ్రిటన్‌కు చెందిన ఓ అమ్మాయి తన ప్రేమగాధను టిక్ టాక్‌లో ఓ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది. ఆ అమ్మాయి బ్రేకప్ తర్వాత తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దృష్టిని ఆకర్షించేందుకు పెళ్లి చేసుకున్నట్లు అందులో పేర్కొంది. ఇక్కడ తమాషా ఏంటంటే.. ఈ పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టిందట. అదేంటని అనుకుంటున్నారా.. అక్కడ పెళ్లి ఏమి జరగలేదండీ.. కేవలం తనకు పెళ్లి జరిగినట్లుగా ఆ యువతి ఓ ఫేక్ మ్యారేజ్‌ను సృష్టించింది.. కొన్ని మ్యారేజ్ ఫోటోలను ఫోటోషాప్ సాయంతో మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు చూస్తే.. ఎవ్వరైనా కూడా ఇట్టే మోసపోతారు.

ఈ ఫేక్ మ్యారేజ్ గురించి తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌కి తెలియజేసేందుకు.. ఆ యువతి ఓ విలాసవంతమైన పార్టీని కూడా ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను సైతం నియమించింది. ఆ పార్టీలో తనకు భర్తగా నటించేందుకు ఓ యాక్టర్‌కు బోలెడంత డబ్బు ఇచ్చింది. తద్వారా తన మాజీ ప్రియుడి దృష్టిని ఆకర్షించగలిగానని చెప్పుకొచ్చింది. ఇక ఈ స్టోరీ విన్నాక నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేశారు.

ఇదంతా చేయడం వల్ల.. ఆమెకు లాభం ఏమైనా జరిగిందా.? ఈ విలాసవంతమైన పార్టీకి ఆమె మాజీ ప్రియుడు విచ్చేశాడా.? అంటూ అడిగారు. అయితే అక్కడ ఇలాంటిది ఏమి జరగలేదు. ఆమె పెళ్లి ఫోటోలను చూసిన మాజీ ప్రియుడు.. కనీసం ఆ యువతికి రిప్లై కూడా ఇవ్వలేదట. ఈ విషయాన్ని చెప్పుకుని ఆమె బాధపడింది. కాగా, ఈ టిక్‌టాక్ వీడియోకు లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ‘ఎవరైనా పెళ్లయ్యాక.. మళ్లీ మీ దగ్గరకు వస్తారా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. చాలామంది ఈమె కథకు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి: వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!