Viral News: వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!

ప్రతీ రోజూ స్నానం చేయడం కంపల్సరీ. స్నానం చేయకుండా ఎవరూ ఉండలేరు. ఎంత చలికాలంలోనైనా రోజుకి ఒక్కసారైనా...

Viral News: వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!
Bath
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 01, 2021 | 5:02 PM

ప్రతీ రోజూ స్నానం చేయడం కంపల్సరీ. స్నానం చేయకుండా ఎవరూ ఉండలేరు. ఎంత చలికాలంలోనైనా రోజుకి ఒక్కసారైనా స్నానం చేస్తారు. కానీ ఇక్కడ ఒక మహిళకి అస్సలు స్నానం చేయడం ఇష్టం ఉండదట. వారానికి ఒకసారి మాత్రమే అతి కష్టం మీద స్నానం చేస్తుందట. పైగా ఈమె చేసేది టీచర్ ఉద్యోగం. ఇక ఈమె వింత అలవాటు గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ఇలా ఉంటే ఈమె పిల్లలకు ఏం నేర్పిస్తుందంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.

ఇంగ్లాండ్‌కు చెందిన 49 ఏళ్ల యువతి వృత్తిరిత్యా టీచర్‌. ఆమె భర్త ఒక ప్లంబర్‌. ఒక నివేదిక ప్రకారం ఈ మహిళ వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, కనీసం శరీరం నుంచి దుర్గంధం రాకుండా వాడే డియోడరెంట్‌లను కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది. ఇక ఆమె శరీరం నుంచి ఏ స్థాయిలో చెడు వాసన వస్తుందో ఊహించండి. అంతేకాదు ఆమె భర్త తన భార్య ప్రతిరోజూ స్నానం చెయ్యాలని బాత్‌రూమ్‌ను ఎంతో అందంగా డిజైన్‌ చేయించాడట కూడా.

అయినా ఆమె స్నానం చెయ్యడానికి ఇష్టపడట్లేదట. అసలు స్నానం చెయ్యాలన్న ఆలోచనే లేనప్పుడు బాత్‌రూమ్‌ అందంగా ఉంటే మాత్రం ఏం లాభం చెప్పండి. బట్టలకు పర్ఫ్యూమ్‌ కొట్టుకుని రోజువారీ పనులు చేసుకుంటుందట. ఇంకో విచిత్రమేంటంటే ఈమె భర్త కూడా రోజూ భార్యని స్నానం చెయ్యమని ఒత్తిడి చెయ్యట్లేదట. ఏంటో… ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. అనిపిస్తుంది కదా… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!