Viral News: కళ్లు చెదిరే వజ్రాల గొడుగు.. దాని ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

అదొక చిన్ని గొడుగు. దాని ధర అక్షరాలా రూ. 30 లక్షలు. ఏంటి చిన్న గొడుగు ధర ఇంతా.? అని ఆశ్చర్యపోకండి..

Viral News: కళ్లు చెదిరే వజ్రాల గొడుగు.. దాని ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!
Gold Umbrella
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 01, 2021 | 6:27 PM

అదొక చిన్ని గొడుగు. దాని ధర అక్షరాలా రూ. 30 లక్షలు. ఏంటి చిన్న గొడుగు ధర ఇంతా.? అని ఆశ్చర్యపోకండి.. అది మాములు గొడుగు కాదు. వజ్రాల గొడుగు. డైమండ్ మార్కెట్ ప్రకారం దీని ధర 25 నుంచి 30 లక్షల రూపాయలు పలుకుతుంది. గొడుగు అని చెప్పి..డైమండ్ మార్కెట్ గురించి చెబుతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా. ఇది డైమండ్స్‌తో చేసిన ఓ ప్రత్యేకమైన గొడుగు. గుజరాత్‌ సూరత్‌కు చెందిన జేమ్స్ అండ్ జ్యువెల్లరీ, వజ్రాల వ్యాపారులు దీనిని తయారు చేసారు. దీని ప్రత్యేక డిజైన్ అందర్నీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ఈ వజ్రాల గొడుగు ముఖ్యంగా మహిళల్ని బాగా ఆకర్షిస్తోంది. దీంతో వజ్రాల వ్యాపారంలో తమకు తామే సాటి అని గుజరాత్‌ మరో సారి నిరూపించింది.

సూరత్ వజ్రాల వ్యాపారులు చేసిన ఈ ప్రత్యేకమైన గొడుగు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ డైమండ్ గొడుగును చేత్న మంగూకియా డిజైన్ చేశాడు. 175 క్యారెట్ల డైమండ్ ఈ గొడుగులో అమర్చారు. 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో ఈ గొడును తయారు చేశారు. 30 మంది వర్కర్లు 2 రోజులపాటు దీనిని తయారు చేశారు. అప్పుడే ఈ గొడుగు గురించి అమెరికా, యూరప్, హాంకాంగ్ వంటి దేశాల్నించి ఆర్డర్లు కూడా వస్తున్నాయట. సూరత్ వజ్రాల వ్యాపారి చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి: వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!