AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూజిలాండ్‌ పించ్ హిట్టర్ కెరీర్‌ ముగిసినట్లే..14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇతడికి జట్టులో స్థానం కష్టం

Colin Munro:14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్, టీ20 ఇంటర్నేషనల్‌లో 3 సెంచరీలు సాధించిన ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌కి గుడ్

న్యూజిలాండ్‌ పించ్ హిట్టర్ కెరీర్‌ ముగిసినట్లే..14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇతడికి జట్టులో స్థానం కష్టం
Munro
uppula Raju
|

Updated on: Dec 01, 2021 | 9:45 PM

Share

Colin Munro:14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్, టీ20 ఇంటర్నేషనల్‌లో 3 సెంచరీలు సాధించిన ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌కి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇతడు ఎవరో కాదు న్యూజిలాండ్ ఓపెనర్ కోలిన్‌ మున్రో. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ ఆటగాడికి ఇప్పుడు జట్టులో స్థానం దక్కుతుందనే ఆశ లేదు. కానీ మున్రో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై చాలా ప్రశ్నలు సంధించాడు. ‘టీ 20 ప్రపంచకప్ జట్టులో నన్ను ఎంపిక చేయనప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పలేదు. ఇప్పుడు అది ముగిసిందని భావిస్తున్నాను’ అని అన్నాడు.

జట్టు నుంచి తప్పుకోవడానికి గల కారణం న్యూజిలాండ్ సెలక్టర్లు తనకు జట్టులో ఎందుకు స్థానం కల్పించలేదో మున్రో చెప్పాడు. గతేడాది బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఆడినందుకు జట్టు నుంచి తప్పించారని మున్రో చెప్పాడు. వాస్తవానికి మన్రో న్యూజిలాండ్ హోమ్ సిరీస్‌ను విడిచిపెట్టి పెర్త్‌తో BBL ఆడాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత అతనికి జట్టులో స్థానం లభించలేదు. అయితే అలా చేయడానికి మున్రో కారణాలు వెల్లడించాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని పెంచేందుకు డబ్బు అవసరమని మున్రో అన్నాడు. అందుకే బీబీఎల్‌లో ఆడానని చెప్పాడు.

న్యూజిలాండ్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఓపెనింగ్ చేయడం చాలా బాధ కలిగించిందన్నాడు. కివీ జట్టు డారెల్ మిచెల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. కోలిన్ మున్రో న్యూజిలాండ్ తరఫున 65 టీ20లు, 57 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. మున్రో T20 ఫార్మాట్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించాడు. 31.34 సగటుతో 1724 పరుగులు చేశాడు. మున్రో టీ20లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో మున్రో 8 అర్ధ సెంచరీల సాయంతో 1271 పరుగులు చేశాడు.

IPL 2022: విరాట్‌ కోహ్లీ స్థానంలో ఈ ఆటగాడు RCB కెప్టెన్ అవుతాడు..! ఈ ప్లేయర్‌ ఎవరో తెలుసా..?

చలికాలంలో బెల్లం తింటే అద్భుత ప్రయోజనాలు.. ముఖ్యంగా ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

ఇతడికి వయసు అనేది నెంబర్‌ మాత్రమే..72 ఏళ్లున్న వ్యక్తి 30 ఏళ్ల యువకుడు.. కారణం ఇదే..