CSA: BCCIతో నిరంతరం టచ్‎లో ఉన్నాం.. దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన ఉంటుంది..

CSA: BCCIతో నిరంతరం టచ్‎లో ఉన్నాం.. దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన ఉంటుంది..
India Tour

దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించిన నేపథ్యంలో ఆ దేశంలో భారత పర్యటనపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) ఛైర్మన్ లాసన్ నైడూ స్పందించారు...

Srinivas Chekkilla

|

Dec 02, 2021 | 8:12 AM

దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించిన నేపథ్యంలో ఆ దేశంలో భారత పర్యటనపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) ఛైర్మన్ లాసన్ నైడూ ఎన్డీటీవీతో మాట్లాడారు. తమ బోర్డు BCCIతో నిరంతరం టచ్‌లో ఉందని, ఇతర దేశాల ప్రయాణాపై ఆంక్షలను ఓవర్ రియాక్షన్‌గా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు.టీకాలు వేసినట్లు ధృవీకరించిన తర్వాత సిరీస్‌లో ప్రతి మ్యాచ్‎కు 2000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని నైడూ తెలిపారు. అతను బయో-సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్ బబుల్‌తో పాటు CSA యొక్క ఎమర్జెన్సీ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను కూడా చెప్పారు.

కొత్త కోవిడ్ వేరియంట్ ఉన్నప్పటికీ పర్యటన కొనసాగుతోందని బీసీసీఐ అధ్యక్షుడు చెప్పారు. మీరు BCCIతో మీరు టచ్‎లో ఉన్నారా?

దక్షిణాఫ్రికాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బీసీసీఐతో మేము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం.

చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మీరు BCCIకి ఏమి చెప్పాలనుకుంటున్నారు?

కోవిడ్ -19 వైరస్ యొక్క కొత్త వేరియంట్‌పై దేశాలు అతిగా స్పందించి ప్రయాణాలపై ఆంక్షలు విధించాయని WHO సంస్థ స్పష్టం చేసింది. మా దృష్టిలో భారతదేశంలోకి ప్రవేశించే ప్రయాణికుల ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలను అమలు చేసింది.

ఈ పర్యటన కోసం బీసీసీఐ ఏదైనా ప్రత్యేక అవసరాన్ని అడిగిందా?

BCCI ఎటువంటి ప్రత్యేక అవసరాలను అభ్యర్థించలేదు. టూర్ ఎల్లప్పుడూ కఠినమైన కోవిడ్-19 ప్రోటోకాల్‌ల ఆధారంగా ఏర్పాటు నిర్వహిస్తాం.

పర్యటన షెడ్యూల్ అలాగే ఉంటుందా లేదా ప్రస్తుతానికి కొన్ని నగరాలకు పరిమితం చేయబడుతుందా?

మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లు జోహన్నెస్‌బర్గ్,సెంచూరియన్‌లలో (ఈ గేమ్‌ల కోసం ఆటగాళ్లు ఒకే హోటళ్లలో బస చేస్తారు) జరుగుతాయి. మూడో టెస్ట్‎తో పాటు అన్ని వైట్ బాల్ గేమ్‌లు కేప్ టౌన్, పార్ల్‌లో నిర్వహిస్తాం.

వేరియంట్‌ను మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యుడు, ఇది హైప్ చేసినంత ప్రమాదకరం కాదని మరియు ఆసుపత్రిలో చేరే అవకాశం చాలా తక్కువ అని వెల్లడించారు. అది పెద్ద అంశం అవుతుందా?

వేరియంట్‌పై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. రాబోయే వారాల్లో మరిన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ప్రస్తుతానికి స్ట్రాండ్ యొక్క తీవ్రత మునుపటి వేరియంట్‌ల కంటే తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. మన శాస్త్రవేత్తలు ఈ విషయంలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నారు.

పర్యటన సజావుగా సాగేందుకు దక్షిణాఫ్రికా బోర్డు తీసుకున్న భద్రత, జాగ్రత్తల గురించి ఏమిటి?

ఆటగాళ్లందరీ భద్రత, మ్యాచ్ అధికారులు, టీమ్ మేనేజ్‌మెంట్ మాకు ప్రాధాన్యత.

Read Also… IPL 2022: సన్‌ రైజర్స్‌ ఈ ఆటగాడికి 40 కోట్లు చెల్లించింది.. కానీ జట్టు నుంచి విడుదల చేసింది.. కారణం ఏంటంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu