Bird Flu in Kerala: కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం.. కోళ్లు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం..

Bird Flu in Kerala: దేశంలో ఓ వైపు కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ విజృంభిస్తుంటే తాజాగా కేరళలలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జనాలు వ్యాక్సిన్‌లేని వైరస్‌లని ఎదుర్కొంటుంటే

Bird Flu in Kerala: కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం.. కోళ్లు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం..
Bird Flu Cases
Follow us
uppula Raju

|

Updated on: Dec 10, 2021 | 3:07 PM

Bird Flu in Kerala: దేశంలో ఓ వైపు కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ విజృంభిస్తుంటే తాజాగా కేరళలలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జనాలు వ్యాక్సిన్‌లేని వైరస్‌లని ఎదుర్కొంటుంటే ఇప్పుడు జంతువులకు కూడా ఆ పరిస్థితి ఎదురైంది. బర్డ్‌ ఫ్లూ వల్ల గతంలో చాలా జంతువులు, పక్షులను చంపేశారు. ఇప్పుడు కేరళలోని అలప్పుజ జిల్లాలోని తకాళి పంచాయతీ పరిధిలో ఈ వైరస్‌ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరింతగా పెరగకుండా ఉండేందుకు పంచాయతీ పరిధిలోని 10వ వార్డు చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు జంతువులను చంపేయాలని నిర్ణయించారు.

బర్డ్ ఫ్లూ తక్కువ సమయంలోనే ఎక్కువ పరిధిలో విస్తరిస్తుంది. అందుకే అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోళ్లని, పెంపుడు జంతువులని చంపేయడానికి ర్యాపిడ్‌ రెస్పాన్స్ అనే ప్రత్యేక టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ అలెగ్జాండర్ పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్‌ ఫ్లూ ఎట్టిపరిస్తితుల్లో విస్తరించకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తగు సూచనలు చేస్తున్నారు.

బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో వాహనాలు, ప్రజల రాకపోకలపై కట్టడి విధించారు. బాతులు, కోళ్లు, పక్షుల గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించారు. మరోవైపు వలస పక్షులకు వైరస్‌ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కేరళలోని హరిప్పడ్‌ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లోనూ ఈ నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి.

Jangareddygudem: షాకింగ్.. రన్నింగ్‌లోనే బ్యాటరీ బైక్‌లో మంటలు.. పూర్తిగా దగ్ధం

2022 Movies Release dates: వచ్చే ఏడాది సినిమాల జాతర.. ఏ మూవీ ఎప్పుడు విడుదలంటే..

మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొంటున్నారా..! దాని ఇన్సూరెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్‌ చేయండి..