Jangareddygudem: షాకింగ్.. రన్నింగ్‌లోనే బ్యాటరీ బైక్‌లో మంటలు… పూర్తిగా దగ్ధం

ఇది అలాంటి.. ఇలాంటి సీన్ కాదు.. ఊహించుకుంటేనే దిమ్మతిరుగుతుంది. రన్నింగ్‌లో ఉండగానే బ్యాటరీ బైక్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

Jangareddygudem: షాకింగ్.. రన్నింగ్‌లోనే బ్యాటరీ బైక్‌లో మంటలు... పూర్తిగా దగ్ధం
Bike Catches Fire
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2022 | 3:02 PM

ఇది అలాంటి.. ఇలాంటి సీన్ కాదు.. ఊహించుకుంటేనే దిమ్మతిరుగుతుంది. రన్నింగ్‌లో ఉండగానే బ్యాటరీ బైక్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాసేపట్లోనే మంటలు చెలరేగాయి. మంటలను స్థానికులు గుర్తించి.. వాహనదారుడ్ని అలెర్ట్ చేయడంతో.. అతడు ఒక్కసారిగా బైక్‌ ఆపి పరిగెత్తడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…  జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడానికి చెందిన  ఆర్ఎంపీ డాక్టర్ నారాయణ మూర్తి తన బ్యాటరీ బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు నారాయణమూర్తిని బైక్ ఆపి రావాలంటూ కేకలు వేశారు. అయితే బైక్ ఆపి వచ్చిన అతడు… బ్యాగ్ మరిచిపోయానని చెప్పి.. బైక్ దగ్గరకి వెళ్లి ఒక్క అడుగు ముందుకు వేసిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ మంటల్లో కాలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల విశాఖ జిల్లా గాజువాకలోని ఓ బ్యాటరీ బైక్‌ల షోరూంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బైక్‌కు ఛార్జింగ్ పెట్టడంతో షార్ట్ సర్క్యూట్ అయి.. సుమారు 15 బైక్‌లు అగ్నికి అహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

Also Read:  రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి