Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Snake in Scooty: ప్రకాశంజిల్లా చీరాలలో ఓ మహిళ స్కూటీ డిక్కీలో పాముపిల్ల చేరింది. వస్తువులు పెడదామని స్కూటీ డిక్కీ ఓపెన్ చేయగా.. ఒక్కసారిగా బుస్సుమంది.

Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Snake
Follow us

|

Updated on: Dec 10, 2021 | 1:53 PM

Snake in Scooty: ప్రకాశంజిల్లా చీరాలలో ఓ మహిళ స్కూటీ డిక్కీలో పాముపిల్ల చేరింది. వస్తువులు పెడదామని స్కూటీ డిక్కీ ఓపెన్ చేయగా.. ఒక్కసారిగా బుస్సుమంది. దాంతో డిక్కీలో పాముపిల్లను చూసిన మహిళ హడలిపోయింది. భయంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు ఏమైందా? అని ఆరా తీశారు. వెంటనే కర్ర సాయంతో డిక్కీలోని పాముపిల్లను చంపేశారు. పాముపిల్లను బయటకు తీసి దూరంగా విసిరేశారు. స్కూటీపై వచ్చిన ఓ మహిళ చెప్పులు కొనేందుకు చీరాల సెంటర్ లో ఓ చెప్పుల షాప్‌కు వచ్చి స్కూటీ పార్క్‌ చేసింది. స్కూటీ డిక్కీ తెరవడంతో పాముపిల్ల దర్శనమిచ్చింది. దీంతో భయంతో మహిళ కేకలు పెట్టింది. స్థానికులు వెంటనే స్కూటీలో చేరిన పాముపిల్లను చంపేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు గంట సేపు నడిరోడ్డుపై స్కూటీలోని పాముపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఇది సాధ్యం కాకపోవడంతో పాటు పాముపిల్ల బయటకు వస్తే ఇతరులను కాటేస్తుందన్న భయంతో దాన్ని కర్రతొ కొట్టి చంపేశారు. ఈ సందర్బంగా కొద్దిసేపు అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Also read:

Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!

AP Political Disputes: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. మధ్యలో ఎంపీ.. కథ మామూలుగా లేదుగా..!

General Bipin Rawat: రావత్ నోట చివరి మాట అదే.. బోరున విలపించిన ప్రత్యక్ష సాక్షి.. ఎందుకంటే..!