Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!

Beti Bachao Beti Padhao Scheme: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం చాలా రాష్ట్రాల్లో సరైన పనితీరు కనబరచలేదు.

Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!
Beti Bachao Beti Padavo
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 10, 2021 | 12:21 PM

Beti Bachao Beti Padhao Scheme: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం చాలా రాష్ట్రాల్లో సరైన పనితీరు కనబరచలేదు. దీనికి సంబంధించి.. బీజేపీ ఎంపీ హీనా విజయ్‌కుమార్ గవిట్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక సంచలన వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. పథకం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులలో 78.91 శాతం నిధులను ఈ పథకంపై ప్రచారం, ప్రకటనల కోసం మాత్రమే వెచ్చించడం జరిగింది. ఇలా నిధుల దుర్వినియోగం చేయడంపై నిరాశ వ్యక్తం చేస్తూ మహిళా సాధికారత కమిటీ ఈ నివేదికలో మరిన్ని కీలక వివరాలు పేర్కొంది.

మహారాష్ట్ర బీజేపీ లోక్‌సభ ఎంపీ హీనా విజయ్‌కుమార్ గవిత్ నేతృత్వంలోని కమిటీ గురువారం నాడు లోక్‌సభలో బేటీ బచావో బేటీ పఢావో పథకానికి సంబంధించి విద్య ద్వారా మహిళల సాధికారతపై ఐదవ నివేదికను సమర్పించింది. 2014-15లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2019-20 వరకు మొత్తం బడ్జెట్‌లో రూ.848 కోట్లు కేటాయించడం జరిగింది. 2020-21 కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పథకానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయితే, కేంద్రం కేటాయించిన నిధుల్లో రాష్ట్రాలకు రూ.622.48 కోట్లు విడుదలయ్యాయి.

ఈ పథకంలో 25.13 శాతం నిధులు వెచ్చించారు.. అయితే, విడుదలైన నిధుల్లో ఈ పథకంపై రాష్ట్రాలు కేవలం 25.13 శాతం నిధులు అంటే రూ.156.46 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. రాష్ట్రాల్లో పథకం అమలు తీరు ఏమాత్రం బాలేదని ప్యానెల్ నివేదిక పేర్కొంది. 2016-2019 మధ్యకాలంలో విడుదలైన మొత్తం రూ. 446.72 కోట్లలో 78.91 శాతం మీడియా ప్రకటనలకే ఖర్చు చేసినట్లు కమిటీ పేర్కొంది. ‘‘బేటీ బచావో బేటీ పడావో సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడానికి మీడియా ప్రచారాలను నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించిన కమిటీ.. అదే సమయంలో పథకం లక్ష్యాలను సమతుల్యం చేయడం కూడా అంతే ముఖ్యం అని అభిప్రాయపడింది. మహిళా శిశు సంక్షేమ శాఖ తక్షణమే స్పందించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించాలని కమిటీ సూచించింది. బాలిక ప్రయోజనాల కోసం ‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

బేటీ బచావో బేటీ పఢావో పథకం అంటే ఏమిటి?.. స్త్రీ, పురుష లింగ బేదాన్ని తగ్గించేందుకు, అన్ని రంగాల్లోనూ స్త్రీలు సాధికారత సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని 22 జనవరి 2015న హర్యానాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పఢావో పథకం జీవితకాలమంతా పిల్లల లింగ నిష్పత్తిలో క్షీణతను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే మహిళా సాధికారతకు ఉపకరిస్తుంది.

ఈ పథకాన్ని మూడు మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి.. ఈ పథకాన్ని మూడు మంత్రిత్వ శాఖలు అంటే మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమం, మానవ వనరుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నాయి. ఈ పథకంలోని ప్రధాన అంశాలు- మొదటి దశలో PC, PNDT చట్టాన్ని అమలు చేయడం.. దేశవ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, ఎంపిక చేసిన 100 జిల్లాలలో (పిల్లల లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న) వివిధ రంగాలకు సంబంధించిన పనులను నిర్వహించడం. వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం, అవగాహన కల్పించడం, అట్టడుగు స్థాయిలో కమ్యూనిటీ సమీకరణ ద్వారా వారి ఆలోచనలను మార్చడంపై దృష్టి సారిస్తున్నారు.

Also read:

AP Political Disputes: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. మధ్యలో ఎంపీ.. కథ మామూలుగా లేదుగా..!

General Bipin Rawat: రావత్ నోట చివరి మాట అదే.. బోరున విలపించిన ప్రత్యక్ష సాక్షి.. ఎందుకంటే..!

Black Box for Aliens: ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ.. ఈ బాక్స్ ఏం చేస్తుందో తెలుసా?..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..