AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Box for Aliens: ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ.. ఈ బాక్స్ ఏం చేస్తుందో తెలుసా?..

Black Box for Aliens: బ్లాక్‌ బాక్స్‌.. విమానాలు లేదా చాపర్‌లు, హెలికాప్టర్‌లు క్రాష్‌ అయినప్పుడు మాత్రమే.. ఈ బ్లాక్‌ బాక్స్‌ను గురించి వింటుంటాం. ఎందుకంటే.. ఈ బ్లాక్‌ బాక్స్‌లోనే ప్రమాదంకు

Black Box for Aliens: ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ.. ఈ బాక్స్ ఏం చేస్తుందో తెలుసా?..
Black Box
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2021 | 9:51 AM

Share

Black Box for Aliens: బ్లాక్‌ బాక్స్‌.. విమానాలు లేదా చాపర్‌లు, హెలికాప్టర్‌లు క్రాష్‌ అయినప్పుడు మాత్రమే.. ఈ బ్లాక్‌ బాక్స్‌ను గురించి వింటుంటాం. ఎందుకంటే.. ఈ బ్లాక్‌ బాక్స్‌లోనే ప్రమాదంకు సంబంధించిన సమచారం అలాగే ప్రమాదంకు ముందు విమానంలో పైలెట్‌ చేసిన మాటల సంభాషణ ఉంటుంది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ బ్లాక్స్‌ యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే ఎర్త్‌ బ్లాక్‌ బాక్స్‌. అవును మీరు విన్నది నిజమే.. ఇది కేవలం భూమి కోసమే.. రెడీ చేశారు. దీన్ని తయారుచెయ్యడానికి బలమైన కారణం ఉంది. సపోజ్.. ఈ భూమిపై ఉన్న మనుషులు, జీవులు అందరూ చనిపోతే… ఆ తర్వాత ఏమవుతుంది? ఏదైనా ఇతర గ్రహం నుంచి ఏలియన్స్‌ భూమికి వస్తే… ఇక్కడ జీవులు ఎలా చనిపోయాయో వారికి తెలియాలన్న ఉద్దేశంతో దీనిని రెడీచేశారు కొందరు సైంటిస్టులు.

అయితే బ్లాక్‌ బాక్స్‌ను కనిపెట్టేంత వరకు అంతాబానే ఉన్నా.? అసలు ఉన్నపళంగా దీనిని కనిపెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్‌. ఉన్నటుండి భూమికి ఇప్పుడు వచ్చిన సమస్యేంటి? యుగాంతం వచ్చేస్తోందా.? అనేది కొందరు వేస్తున్న ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు కొందరు సైంటిస్టులు క్లారిటీ కూడా ఇచ్చారు. అలాంటిదేమి లేదని, కాకపోతే… అలా అయితే అప్పుడేంటి పరిస్థితి అని ఆలోచించి ఈ బ్లాక్ బాక్స్ తయారుచేశామని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ఏమైనా జరగొచ్చు అని ఊహించుకొని దీన్ని రెడీ చేశామని అన్నారు.

అయితే ఈ ప్రస్తుతం ఈ బ్లాక్‌ బాక్స్‌.. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా పశ్చిమ తీరంలో దీని నిర్మించారు. 2022 నాటికి దీని నిర్మాణం వంద శాతం పూర్తవుతుందని తెలిపారు సైంటిస్టులు. భూమిపై ప్రళయం అంటే… యుగాంతం మొదలవ్వగానే… ఇది ప్రతీ అంశాన్నీ రికార్డ్ చెయ్యడం మొదలుపెడుతుందని, ఇప్పటికే ఇది బీటా వెర్షన్‌లో లైవ్ రికార్డ్ చేస్తున్నట్లు దీన్ని తయారుచేసిన ఎర్త్స్‌ బ్లాక్‌బాక్స్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

బీటా వెర్షన్‌లో ట్రయల్ పూర్తయ్యాక… ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు ఎర్త్స్‌ బ్లాక్‌బాక్స్‌ సంస్థ నిర్వాహకులు. యాక్టివేట్‌ చేసిన ఆ క్షణం నుంచి ఇది భూమిపై వచ్చే మార్పుల్ని రికార్డ్ చేస్తుంది. వాతావరణం, ఉష్ణోగ్రతలు, తుఫానులు, గాలి కాలుష్యం, కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు మనిషి లాగా ఇది ఇంటర్నెట్‌లో స్వయంగా సెర్చ్ చేసుకొని డేటా సేకరించుకునేలా దీనికి ప్రత్యేక ఆల్గారిథం సెట్ చేశామని తెలిపారు.

Also read:

Knight Frank India report: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి.. లేకుంటే ధరలు పెరుగుతాయి..!

UAN నెంబర్‎ను ఆధార్‎కు లింక్ చేశారా ?? లేకుంటే వెంటనే చేయండి !! వీడియో

Tiger Fear – Telangana: అభయారణ్యంలో మాటు వేసిన బెబ్బులి.. పశువులపై దాడి.. కెమెరాకు చిక్కిన భీకర ఫోటోలు..!