AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Chip: చిప్‌తో పనిచేసే మానవ మెదడు.. 2022 నుంచి మొదలుకానున్న ప్రయోగాలు..!

Elon Musk: కోతులపై చిప్ పరీక్ష విజయవంతమైందని, ఇది పూర్తిగా సురక్షితమని తెలిపారు. ప్రస్తుతం మానవులపై ఈ పరీక్షను ప్రారంభించడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్..

Brain Chip: చిప్‌తో పనిచేసే మానవ మెదడు.. 2022 నుంచి మొదలుకానున్న ప్రయోగాలు..!
Elon Musk
Venkata Chari
|

Updated on: Dec 10, 2021 | 11:39 AM

Share

Brain Chip: బ్రెయిన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ సీఈఓ ఎలోన్ మస్క్, తమ కంపెనీ బ్రెయిన్ చిప్‌ను 2022లో మానవ ప్రయత్నాలను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోతులపై చిప్ పరీక్ష విజయవంతమైందని, ఇది పూర్తిగా సురక్షితమని తెలిపారు. ప్రస్తుతం మానవులపై ఈ పరీక్షను ప్రారంభించడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.

మా ప్రయత్నానికి ఆమోదం వచ్చిన వెంటనే మానవులపై ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నాడు. అయితే ముందుగా టెట్రాప్లెజిక్స్, క్వాడ్రిప్లెజిక్స్ వంటి తీవ్రమైన వెన్నెముక గాయాలు ఉన్న వ్యక్తులకు ఈ చిప్‌ను అమర్చనున్నామని తెలిపారు. వాస్తవానికి, న్యూరాలింక్ ఇలాంటిదే అంటే న్యూరల్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఔటర్ హార్డ్‌వేర్ లేకుండా మెదడు లోపల జరుగుతున్న కార్యాచరణను వైర్‌లెస్‌గా ప్రసారం చేయగలదు. నడవలేని, చేతితో పని చేయలేని వ్యక్తికి బలం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 9, 2021న న్యూరాలింక్‌ మెదడు చిప్‌ని కోతికి అమర్చారు. దీని కారణంగా కోతి తన మెదడును ఉపయోగించి హాయిగా పాంగ్ గేమ్ ఆడింది. కోతి మెదడులో, గేమ్ ఆడుతున్నప్పుడు న్యూరాన్‌లు సక్రమంగా పనిచేస్తున్నట్లు పరికరం తెలియజేసి, గేమ్ సమయంలో కదలికలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. చిప్‌ని ఇన్‌స్టాల్ చేసినప్పటికీ కోతి మామూలుగా ఉందని, ఎంచక్కా వీడియో గేమ్ ఆడుతుందని మస్క్ నివేదించారు. ఇది మంచి ప్రయోగం అని నా అభిప్రాయం. న్యూరాలింక్ అనేది చిన్న ఫ్లెక్సిబుల్ థ్రెడ్‌ల ద్వారా కనెక్ట్ చేయబడిన కంప్యూటర్ చిప్ అని వెల్లడించారు.

Also Read: U-19 Asia Cup: ఆసియా కప్‌‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ప్రకటించిన బీసీసీఐ.. ఎనిమిదోసారి టైటిల్‌ గెలిచేందుకు సిద్ధం..!

Vijay Hazare Trophy: సెంచరీతో సత్తా చాటిన హైదరాబాదీ.. తుఫాన్ ఇన్నింగ్స్‌లో 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు.. ఓడిపోయిన శిఖర్ ధావన్‌ టీం..!