Vijay Hazare Trophy: సెంచరీతో సత్తా చాటిన హైదరాబాదీ.. తుఫాన్ ఇన్నింగ్స్‌లో 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు.. ఓడిపోయిన శిఖర్ ధావన్ టీం..!
Tilak Varma: ఢిల్లీ జట్టులో భారత క్రికెట్ టీంలో అనుభవజ్ఞుడైన ఓపెనర్ శిఖర్ ధావన్ లాంటి బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఆటగాళ్లు లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు.
Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీ 2021, భారత దేశవాళీ క్రికెట్ టీమ్ సీజన్‌లో రెండవ అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్. ప్రారంభమైన రెండు రోజుల్లోనే కొన్ని గొప్ప ప్రదర్శనలు కనిపించాయి. గురువారం, హైదరాబాద్‌లో ఇదే విధమైన ప్రదర్శన ఆకట్టుకుంది. అక్కడ యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ చేసిన అద్భుతమైన సెంచరీ ఆధారంగా గ్రూప్ సి మ్యాచ్‌లో హైదరాబాద్ 79 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది.
2020 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగమైన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 123 బంతుల్లో 139 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, తిలక్ కేవలం 15 బంతుల్లో సిక్సర్లు, ఫోర్లతో 76 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.
తిలక్ చందన్ సాహ్నితో కలిసి నాలుగో వికెట్‌కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సాహ్ని 74 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లు, భాగస్వామ్యంతో హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
దీంతో ఢిల్లీ జట్టు తొమ్మిది వికెట్లకు 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు తరఫున ఏ బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. హిమ్మత్ సింగ్ 47, అనుత్ రావత్ 36 పరుగులు చేశారు. జట్టుకు అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్, టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 12 పరుగులు చేసి ఔటయ్యాడు. హైదరాబాద్ తరఫున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
India vs South Africa: వన్డే సిరీస్ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిర్ణయమే కారణమా?