AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar: 19 ఏళ్ల నిరీక్షణ ముగించిన లిటిల్ మాస్టర్.. నేటికీ ఈ రికార్డు చెక్కు చెదరలే.. అదేంటంటే?

Sunil Gavaskar: ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో శ్రీలంకతో మ్యాచ్ జరుగుతుండగా, సచిన్ టెండూల్కర్ లంక బౌలర్ చమిందా వాస్ వేసిన బంతిని లెగ్ సైడ్‌లో ఆడి ఒక పరుగు తీసుకుని..

Sachin Tendulkar: 19 ఏళ్ల నిరీక్షణ ముగించిన లిటిల్ మాస్టర్.. నేటికీ ఈ రికార్డు చెక్కు చెదరలే.. అదేంటంటే?
Sachin, Gavaskar
Follow us
Venkata Chari

|

Updated on: Dec 10, 2021 | 9:55 AM

On This Day In Cricket: డిసెంబర్ 10వ తేదీ క్రికెట్ చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున ఓ అద్భుత రికార్డు ఏర్పడింది. ఇది ఇప్పటివరకు అలాగే ఉండడం విశేషం. 19 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. అప్పటి వరకు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన రికార్డును సరిగ్గా 16 సంవత్సరాల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజున బద్దలు కొట్టాడు.

దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజునే సెంచరీ చేసిన దిగ్గజ భారతీయ బ్యాట్స్‌మెన్, రికార్డుల మెషిన్ సచిన్ టెండూల్కర్ 10 డిసెంబర్ 2005న పాత రికార్డును బద్దలు కొట్టాడు. తొలిరోజు ఆట ముగిసే కొన్ని నిమిషాల ముందు, లిటిల్ మాస్టర్ లంక బౌలర్ చమిందా వాస్ వేసిన బంతిని లెగ్ సైడ్‌లో ఆడుతూ పరుగు తీసి గాలిలోకి దూకాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే సచిన్ చరిత్ర సృష్టించాడు.

దీంతో సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్టు సెంచరీల ప్రపంచ రికార్డును సచిన్ టెండూల్కర్ బద్దలు కొట్టాడు. 1986లో శ్రీలంకపై గవాస్కర్ తన 34వ, చివరి సెంచరీని సాధించాడు. ఒక సంవత్సరం తర్వాత రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ రికార్డు బద్దలవుతుందా అని క్రికెట్ నిపుణులు ఎదురు చూస్తున్నారు.

సచిన్ ఈ రికార్డును తన పేరు మీద లిఖించుకున్న తర్వాత, మరో 8 సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఈ సమయంలో సచిన్ తన పేరు మీద మరో రికార్డును చేర్చుకున్నాడు. మరో 16 సెంచరీలను సాధించాడు. ఇది నేటికీ అలానే ఉంది. తన 200 టెస్టు కెరీర్‌లో సచిన్ మొత్తం 51 సెంచరీలు చేసి 15921 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ దాటలేకపోవడం విశేషం.

Also Read: India vs South Africa: వన్డే సిరీస్‌ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిర్ణయమే కారణమా?

IND vs SA: మిడిలార్డర్‌ లోటును భర్తీ చేసేది తెలుగు కుర్రాడే.. ద్రవిడ్ స్కెచ్ మాములుగా లేదుగా..!