IND vs SA: మిడిలార్డర్‌ లోటును భర్తీ చేసేది తెలుగు కుర్రాడే.. ద్రవిడ్ స్కెచ్ మాములుగా లేదుగా..!

Indian Cricket Team: టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ చాలా కాలం ఫామ్‌లో లేదు. కానీ, దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు, జట్టుకు గొప్ప వార్త అందింది.

IND vs SA: మిడిలార్డర్‌ లోటును భర్తీ చేసేది తెలుగు కుర్రాడే.. ద్రవిడ్ స్కెచ్ మాములుగా లేదుగా..!
Hanuma Vihari
Follow us

|

Updated on: Dec 10, 2021 | 8:26 AM

India vs South Africa: విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా ఫామ్‌లో లేరు. అజింక్యా రహానే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టీమ్ ఇండియా త్రిమూర్తులుగా పేరొందిన ఈ ఆటగాళ్లకు పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఈ ముగ్గురు ఆటగాళ్ల బ్యాట్ చాలా కాలంగా మూగబోవడంతో టీమ్ ఇండియా చాలా నష్టపోయింది. ప్రస్తుతం టీమిండియా ముందు దక్షిణాఫ్రికా రూపంలో సవాల్‌ ఎదురుకానుంది. ప్రత్యర్థిని వారి స్వదేశంలో ఢీకొనబోతోంది. మరి ఇలాంటి సమయంలో వీరికి ప్రత్యామ్నాయంగా జట్టులోకి ఎవరు రానున్నారో ఓ సారి చూద్దాం.

వాస్తవానికి, దక్షిణాఫ్రికా గడ్డపై పరుగులు చేయగల మిడిల్ ఆర్డర్‌కు టీమ్ ఇండియాకు ఒక బ్యాట్స్‌మెన్‌ దొరికాడు. విరాట్, పుజారా వంటి బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ అయినప్పటికీ మ్యాచులో టీమిండియా పునరాగమనం చేయగలదు. దక్షిణాఫ్రికా ఏ టూర్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హనుమ విహారి ఈ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

దక్షిణాఫ్రికా ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసినప్పటికీ హనుమ విహారి స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాట్స్‌మెన్‌ని న్యూజిలాండ్‌తో సిరీస్‌కు జట్టు నుంచి తప్పించి దక్షిణాఫ్రికాకు పంపారు. దక్షిణాఫ్రికా పిచ్, పేస్‌ను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా ఈ మార్పు చేశారు. హనుమ విహారి అర్థం చేసుకోవడమే కాకుండా, ఈ పర్యటనలో టీమిండియాకు అత్యంత కీలకమైన బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకోబోతున్నట్లు తన బ్యాట్‌తో ఇప్పటికే ప్రకటించాడు.

Hanuma Vihari 01 1

సౌతాఫ్రికా-ఏతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్-ఏ తరఫున హనుమ విహారి అత్యధికంగా 227 పరుగులు చేశాడు. హనుమ విహారి 5 ఇన్నింగ్స్‌లలో 3 అర్ధ సెంచరీలు సాధించి రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. హనుమ విహారి బ్యాటింగ్ సగటు 75 కంటే ఎక్కువగా ఉంది.

హనుమ విహారి ఈ ప్రదర్శన అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నుంచి ప్లేయింగ్ XIలో భాగమని నిరూపిస్తుంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆటగాడిని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి మరి.

Also Read: IND vs SA: 4 ప్లాన్స్‌తో సిద్ధమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమ్ ఇండియాలో కనిపించనున్న మార్పులేంటంటే?

విజయ్ హజారే‌లో మెరిసిన ఐపీఎల్ స్టార్స్.. వరుస శతకాలతో దూసుకపోతోన్న యంగ్ ప్లేయర్స్.. సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యే ఛాన్స్?

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం