AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ హజారే‌లో మెరిసిన ఐపీఎల్ స్టార్స్.. వరుస శతకాలతో దూసుకపోతోన్న యంగ్ ప్లేయర్స్.. సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యే ఛాన్స్?

Vijay Hazare Trophy 2021: ఐపీఎల్ ద్వారా పేరు పొందిన యువ స్టార్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ తమ జోరు కొనసాగించారు.

విజయ్ హజారే‌లో మెరిసిన ఐపీఎల్ స్టార్స్.. వరుస శతకాలతో దూసుకపోతోన్న యంగ్ ప్లేయర్స్.. సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యే ఛాన్స్?
Ruturaj Gaikwad Venkatesh Iyer
Venkata Chari
|

Updated on: Dec 10, 2021 | 7:06 AM

Share

Ruturaj Gaikwad-Venkatesh Iyer: ఐపీఎల్ ద్వారా పేరు పొందిన యువ స్టార్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ తమ జోరు కొనసాగించారు. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న గైక్వాడ్ వరుసగా రెండు రోజుల్లో రెండో సెంచరీ సాధించాడు. అదే సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేష్ అయ్యర్ కేరళపై సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు.

గైక్వాడ్ 143 పరుగులతో నాటౌట్‌.. బుధవారం మధ్యప్రదేశ్‌పై 136 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన గైక్వాడ్, గురువారం ఛత్తీస్‌గఢ్‌పై అజేయంగా 154 పరుగులు చేశాడు. 143 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అతని ఇన్నింగ్స్‌తో మహారాష్ట్ర 276 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలి ఉండగానే సాధించింది. గైక్వాడ్‌ను ఇదే ఫామ్‌లో కొనసాగించగలిగితే.. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియాకు ఎంపికయ్యే అవకాశం ఉంది.

వెంకటేష్ 84 బంతుల్లో 112 పరుగులు.. మరో మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ కేరళ బౌలర్లను చిత్తు చేశాడు. కేవలం 84 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ స్కోరు 329/9గా నమోదైంది. అనంతరం కేరళ జట్టు 49.4 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌటైంది. వెంకటేష్ 55 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అదే సమయంలో పునీత్ డేట్ 59 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన గైక్వాడ్ రితురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ చివరి సీజన్‌లో బాగా బ్యాటింగ్ చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేశాడు. అతను లీగ్‌లో అత్యధిక రన్ స్కోరర్‌గా ఉండడంతో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. 24 ఏళ్ల గైక్వాడ్ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఆల్‌రౌండర్‌గా అద్భుతాలు.. ఐపీఎల్‌‌లో 370 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ IPL-2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగాడు. 10 మ్యాచుల్లో 370 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు పడగొట్టాడు.

Also Read: BCCI: భారత అత్యుత్తమ కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా.. చివరి వన్డే ఆడేందుకు అవకాశం ఇవ్వరా.. బీసీసీఐపై ఫైరవుతోన్న నెటిజన్లు

Team India: ద్రవిడ్ ఆట మొదలైంది.. కోహ్లీకి షాకిచ్చిన కొద్ది గంటలకే మరో సంచలనం.. వైస్ కెప్టెన్‌గా ఆయన పేరు సిద్ధం..!