BCCI: భారత అత్యుత్తమ కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా.. చివరి వన్డే ఆడేందుకు అవకాశం ఇవ్వరా.. బీసీసీఐపై ఫైరవుతోన్న నెటిజన్లు
Indian Cricket Team: విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీకి బోర్డు 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. ఎలాంటి..
Virat Kohli: విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీకి బోర్డు 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో బోర్డు స్వయంగా ఆయనను ఈ పదవి నుంచి తొలగించింది. దేశంలో అత్యంత విజయవంతమైన నాలుగో నంబర్ వన్డే కెప్టెన్‌ను తొలగించడంపై వస్తున్న స్పందనల మధ్య బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు.
భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ‘ఈ నిర్ణయం బీసీసీఐ, సెలెక్టర్లు సంయుక్తంగా తీసుకున్నాయి. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని బీసీసీఐ విరాట్‌ను కోరినప్పటికీ అతను అంగీకరించలేదని’ పేర్కొన్నాడు.
గంగూలీ మాట్లాడుతూ, “పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఉండకూడదని సెలక్టర్లు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విరాట్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతుండగా, వన్డే, టీ20కి రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు’ అని తెలిపాడు.
టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నప్పుడు గంగూలీ ఏం చెప్పాడంటే..? టీ20 ప్రపంచ కప్‌కు ముందు, విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్సీని విడిచిపెట్టినప్పుడు, కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదిలిపెట్టడం తనను ఆశ్చర్యపరిచిందని గంగూలీ చెప్పాడు.
ఇంగ్లండ్ పర్యటన తర్వాత విరాట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండేవాడని అన్నాడు. ఇది కోహ్లీ సొంత నిర్ణయం. బీసీసీఐ వైపు నుంచి కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి లేదు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం గురించి మేం అతనికి ఏమీ చెప్పలేదు. నేను కూడా ఆటగాడిని, నేను దానిని బాగా అర్థం చేసుకున్నందున మేం అతనిపై ఎలాంటి ఒత్తిడి చేయలేదంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు.
గంగూలీ మాట్లాడుతూ, మూడు ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగడం కష్టమని నేను భావిస్తున్నాను. నేనే ఆరేళ్ల పాటు టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాను. బయటికి అంతా బాగానే ఉంది. కానీ, లోపల ఏమి జరుగుతుందో కెప్టెన్‌కు మాత్రమే అర్థం అవుతుంది. ఇది చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చాడు.
ట్రోల్స్‌కు గురైన గంగూలీ, జైషా.. రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అయ్యారు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is how India treats Virat Kohli and Look at how NZ treats Kane Williamson#ShameonBcci pic.twitter.com/h9cx8mAndc
— Gaurav?️ (@Kohli4ever) December 9, 2021
The fcking disrespect to an all time great. 15 hrs post announcement not even a thank you tweet to a captain who has captained Lois in the last 5 years, 3rd most win % in odi history. Deseved way better#ShameonBCCI pic.twitter.com/TeJAvVhLo1
— A (@_shortarmjab_) December 9, 2021
Ppl who ruined Indian cricket ? #ShameonBCCI pic.twitter.com/z9038voqsy
— Cricfam (@cricfam) December 9, 2021