India vs South Africa: వన్డే సిరీస్‌ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిర్ణయమే కారణమా?

Virat Kohli: టెస్టు ఫార్మాట్‌లో ప్రస్తుతం విరాట్ కోహ్లీ మాత్రమే కెప్టెన్‌గా ఉండనున్నాడు. టీ20, వన్డే ఫార్మాట్ల కమాండ్‌ను రోహిత్ శర్మకు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే.

India vs South Africa: వన్డే సిరీస్‌ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిర్ణయమే కారణమా?
T20 World Cup 2021, Ind Vs Nz, Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Dec 10, 2021 | 9:51 AM

India vs South Africa: సౌతాఫ్రికా టూర్‌కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుని వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ, బీసీసీఐ, సెలెక్టర్లు కోహ్లీ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకోలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో ఒకే ఒక్క కెప్టెన్ ఉండాలని వారంతా కోరుకున్నాడు. దీంతో బీసీసీఐ రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ది టెలిగ్రాఫ్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ తర్వాత, జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు ఫుల్ టైం కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన మొదటి వన్డే సిరీస్ ఆడనున్నాడు.

విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే గురువారం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఓ వివరణ ఇచ్చాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడం బీసీసీఐకి ఇష్టం లేదని, అయితే అతను బోర్డు చెప్పినా వినలేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈమేరకు కోహ్లీకి 48 గంటల గడువు ఇచ్చినా, ఎలాంటి సమాధానం లేకపోవడంతో బీసీసీఐ పెద్దలు కోహ్లీని తప్పించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ చాలా అసహనానికి గురయ్యాడంట. దీంతోనే బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా వన్డే సిరీస్‌ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ నాలుగున్నరేళ్ల పాటు వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో అతను 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 గెలిచాడు. కోహ్లీ విజయాల శాతం 70కి పైగా ఉంది.

విరాట్ కోహ్లీ సారథ్యంలో, టీమ్ ఇండియా మూడుసార్లు ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకోలేకపోయింది. ఇదే విషయం కోహ్లీకి వ్యతిరేకంగా మారింది. అందుకే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను రోహిత్ శర్మకు బీసీసీఐ అప్పగించింది. టీ20 ప్రపంచకప్‌ 2022, ప్రపంచకప్‌ 2023లో టీమిండియా రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read: IND vs SA: మిడిలార్డర్‌ లోటును భర్తీ చేసేది తెలుగు కుర్రాడే.. ద్రవిడ్ స్కెచ్ మాములుగా లేదుగా..!

IND vs SA: 4 ప్లాన్స్‌తో సిద్ధమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమ్ ఇండియాలో కనిపించనున్న మార్పులేంటంటే?

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?