RRR: రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి

'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషన్స్ జోరు కూడా పెంచింది.

RRR: రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి
SS Rajamouli
Follow us
Ram Naramaneni

| Edited By: Subhash Goud

Updated on: Dec 09, 2021 | 11:31 PM

‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషన్స్ జోరు కూడా పెంచింది. ఈ క్రమంలో టీమ్ సభ్యులు ఇంటర్వ్యూల్లో పాల్గొని.. ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. రాజమౌళి మూవీస్ గురించి ఓ క్రేజీ విషయం చెప్పారు. రాజమౌళి సినిమాలన్నింటిలో ఏయా విభాగాలు సినిమాను డామినేట్ చేసేవో చెప్పుకొచ్చారు.  ‘స్టూడెంట్​ నం.1’ లో మ్యూజిక్, ‘సింహాద్రి’లో స్టోరీ, ‘సై’లో డైరెక్షన్ మూవీని డామినేట్ చేశాయని చెప్పుకొచ్చారు. ‘ఛత్రపతి’ మూవీకి మాత్రం అన్నీ సమపాళ్లలో కుదిరాయని వివరించారు. అయితే  ‘విక్రమార్కుడు’ విషయంలో మాత్రం వీటికి భిన్నంగా జరిగిందని కీరవాణి వివరించారు. హీరో రవితేజ సినిమా మొత్తాన్ని డామినేట్​ చేశారు కీలక కామెంట్స్ చేశారు.

 ‘విక్రమార్కుడు’ 2006లో విడుదలయ్యింది. దొంగగా, పోలీస్‌గా రవితేజ అదరగొట్టాడు. మాస్ ఆడియెన్స్ ఈ మూవీకి క్యూ కట్టడంతో సినిమా ప్రభంజనం సృష్టించింది.  అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాఠోడ్​ పాత్రల్లో రవితేజ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా.. రాజమౌళి కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్ హిట్ అని చెప్పాలి.

Vikramarkudu

కాగా జక్కన్న రాజమౌళి కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రామ్​చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, శ్రియ సముద్రఖని, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్‌గా విడుదలైన చిత్ర ట్రైలర్‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Rrr

Also Read: టీచర్‌కు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన స్టూడెంట్స్.. అది ఓపెన్ చూసి చూడగానే అతడి రియాక్షన్ సూపర్

సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్