AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మరో ఘనత అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ .. నంబర్‌ వన్‌ సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీగా ప్రభాస్‌!

'బాహుబలి' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌. ఆతర్వాత 'సాహో' తో తన క్రేజ్‌ను మరింత క్రేజ్‌ పెంచుకున్నాడు

Prabhas: మరో ఘనత అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ .. నంబర్‌ వన్‌ సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీగా ప్రభాస్‌!
Basha Shek
|

Updated on: Dec 09, 2021 | 9:47 PM

Share

‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌. ఆతర్వాత ‘సాహో’ తో తన క్రేజ్‌ను మరింత క్రేజ్‌ పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలతో దేశ విదేశాల్లో లెక్కలేనంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో. చైనా, జపాన్, థాయ్ లాండ్. తదితర దేశాల్లో సైతం డార్లింగ్‌కు అభిమానులు ఏర్పాడ్డారు. గతంలో రజనీకాంత్‌, ఆమీర్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ లాంటి సూపర్‌స్టార్లకు మాత్రమే దేశ విదేశాల్లో ఫ్యాన్స్‌ ఉండేవారు. అయితే ఇప్పుడు వారి సరసన మన ప్రభాస్ కూడా చేరాడు. ప్రస్తుతం అతను సినిమా చేస్తున్నాడంటే టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇలా సినిమా రంగంలో ఆకాశమంతటి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ తాజాగా మరొక ఘనతను సొంతం చేసుకున్నాడు. యూకేకు చెందిన ప్రముఖ ‘ఈస్టర్న్‌ ఐ వీక్లీ’ వెబ్‌సైట్‌ 2021 కి సంబంధించి వెలువరించిన టాప్‌- 50 సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీల జాబితాలో డార్లింగ్‌ అగ్రస్థానం కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ రెండో స్థానంలో నిలిచినట్లు సమాచారం.

‘సాహో’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ప్రభాస్‌ త్వరలోనే ‘రాధేశ్యామ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’, ‘ప్రాజెక్ట్‌- కే’, ‘సలార్‌’ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రాలే కావడం విశేషం.

Also Read:

RRR: రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట చేసిన కీరవాణి

Ashu Reddy: అందం.. అమాయకత్వం కలిపితే అషురెడ్డి.. లేటెస్ట్ ఫొటోస్ తో రచ్చ చేస్తున్న వయ్యారి భామ..

Green India Challenge-Mehreen:నేను సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటి ఫొటోలకి ఫోజులిచ్చిన మెహ్రీన్..