Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'భీమ్లా నాయక్‌. నిత్యా మీనన్‌, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కే. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా

Bheemla nayak:  రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న  భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2021 | 10:30 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌. నిత్యా మీనన్‌, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కే. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలవడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2021 జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్‌ కానుంది. అయితే తాజాగా ‘భీమ్లా నాయక్’ చిత్రానికి రన్ టైమ్ లాక్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో స్పెషల్ సాంగ్స్, ఇతర పాటలు, అనవసర సన్నివేశాలు లేకుండా గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో కేవలం 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసినట్లు సమాచారం.

కాగా ‘భీమ్లా నాయక్‌’ కు పోటీగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్‌’ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఇక రాజమౌళి సినిమాల నిడివి ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ రన్‌ టైమ్‌ కూడా మూడు గంటలకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువేనని తెలుస్తోంది. మరి వీటితో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ రన్‌ టైమ్‌ చాలా తక్కువని తెలుస్తుంది. అయితే గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో సాగే ఈ రన్ టైమే తమ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని టాక్‌ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురుచూడక తప్పదు.

Also read:

Mehreen Pirzada: బాలయ్య సినిమాలో సందడి చేయనున్న హానీ పాప.. ఏ మూవీలో అంటే..

Prabhas: మరో ఘనత అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ .. నంబర్‌ వన్‌ సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీగా ప్రభాస్‌!

Shriya Saran Photos: తరగని వయ్యారంతో వరుస సినిమాలు లైన్ లో పెట్టిన హాట్ బ్యూటీ.. శ్రీయ ఫొటోస్..