China on Bipin Rawat Death: బిపిన్ రావత్ వీరమరణంపై చైనా మీడియా కారుకూతలు.. భారత త్రిదళాధిపతిపై అక్కసు ఎందుకు..
పిచ్చికూతలు కూయడంలో ముందుండే చైనా.. ఇదే అదునుగా అక్కడి మీడియాను ఉసిగొల్పుతోంది. అక్కడి సోషల్ మీడియా కేంద్రంగా తక్కువ చేసి మాట్లాడుతోంది. వీరుల మరణాన్ని ఎద్దేవ చేస్తోంది. కుక్క తోక వంకర అనే రీతిలో వ్యవహరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, డ్రాగన్ బుద్ధి మారడం లేదు. ఎలాగైన భారత్‌ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు ఆపడం లేదు. భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వీరమరణంపై చైనా మీడియా కారుకూతలు కూస్తోంది. భారత త్రిదళాధిపతిపై అక్కసు వెల్లగక్కుతోంది. దురదృష్టకర, విషాదకరమైన ఘటనను ఆసరాగా చేసుకుని కామెంట్స్ చేస్తోంది. నీచ రాజకీయాలు చేసేందుకు అక్కడి మీడియా పిచ్చి రాతలకు తెరలేపింది. జనరల్ బిపిన్ రావత్ మరణం భారతదేశం క్రమశిక్షణ, పోరాట సంసిద్ధతను బహిర్గతం చేసిందని చైనా తొత్తు గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచూరించింది.
బిపిన్ రావత్ మరణాన్ని అడ్డుపెట్టుకుని కారుకూతలు కూస్తున్న చైనా మీడియా. బిపిన్ డెత్ వెనుక ఇండియా క్రమశికణా రాహిత్యం, రక్షణ పరమైన చర్యల లేమి అంటూ ప్రకటనలు చేస్తోంది.అసలు రావత్ అంటే చైనాకు ఎందుకంత కంటగింపు? రావత్ అంటే చైనాకు ఎందుకంటే కోపం..? అందుకు కారణం ఉంది. చైనా వెన్నులో భయం తెప్పించిన వ్యక్తి రావత్.
ధీశాలి బిపిన్ అంటే చైనాకు ఎందుకుంత వణుకు అంటే.. భారతమాత ముద్దుబిడ్డ బిపిన్ రావత్.. యుద్దతంత్రం తెలిసినవాడు. వెన్నువిరవని ధీశాలి.. ఆధునిక యుద్ద వ్యూహాలను ఔపోసన పట్టిన అపర సుభాష్ చంద్రబోస్ అన్నింటికి మించి చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు వణుకు పుట్టించే యుద్దనేర్పరి.. సైనికదళాలకు ఆత్మస్థయిర్యం ఇచ్చే మహోన్నత యుద్ధ శిఖరం. సైనిక దళాలకు ఆయనొక ఉత్తేజపూరిత హిమవన్నగం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా .. సవాళ్లను అధిగమించే ధృఢచిత్తం కలిగిన యుద్ధ వీరుడు బిపిన్.. ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చి భారత సైనిక వ్యవస్థను తీర్చిదిద్దిన మహోన్నత దళపతి అని చెప్పవచ్చు. ఈ లక్షణాలే డ్రాగన్ కంట్రీ చైనాకు కంటగింపుగా మారాయి.
అతడు ఎదురొస్తే సముద్రాలు తడబడతాయ్.. బిపిన్ నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. ఆయన పొగరు ఎగిరే మూడు రంగుల జెండా. ఆయన ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. ఆయన భూతల్లి చనుబాలు తాగిన భారత మాత ముద్దుబిడ.
అంతే కాదు పాకిస్తాన్ పై భారత సైనికులు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో శత్రు దేశాలకు వణుకు పుట్టించిన ఘనత భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ సింగ్ రావత్. భారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తల సంగతి తెలిసిందే. డోక్లాం ఘటనలో ఆయన అనుసరించిన వ్యూహం భారత్ సైనికుల్లో ధైర్యాన్ని పెంచింది.
చైనా కట్టడికి భారత్ అనేక వ్యూహాలు అనురిస్తోంది. ఇందులో దౌత్య వ్యూహాలతో పాటు రక్షణ వ్యూహాలూ ఉన్నాయి. క్వాడ్ దేశాల సంఖ్యను పెంచడం ద్వారా చైనా కట్టడికి బాటలు పరుస్తూనే సొంత సైన్యాన్ని మరింత శక్తివంతం చేసుకుంది భారత్. అందులో భాగంగానే.. ఏకంగా ఆరు జలాంతర్గాములను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖలో ఇది భారీ నిర్ణయం.. దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు భారత్ సిద్దంగా ఉంది.
ఇదంతా ఆయన సైనిక వ్యూహంలో బాగంగానే జరుగుతోంది. ఇవే కాదు జలాంతర్గాముల కొనుగోలు.. స్కార్పియన్, కల్వరీ జలాంతర్గాముల నిర్మాణం జరిగిన చాలాకాలం తర్వాత పి-75 ఇండియా ప్రాజెక్టు పేరుతో 6 అధునాతన జలాంతర్గాములను ఫ్రాన్స్ భాగస్వామ్యంతో రెడీ చేసుకుంది. వీటిని మజగావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ ద్వారా నిర్మించే అవకాశం ఉంది. బిపిన్ నేతృత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం చైనా వెన్నులో వణుకు పుట్టించింది. సముద్ర ప్రాంతాలపై ఆధిపత్యం ద్వారా పొరుగు దేశాలను భయపెట్టాలన్న చైనా వ్యూహానికి ఈ నిర్ణయంతో చెక్ పెట్టింది.
యావత్ భారతావని కన్నీరు పెడుతోంది. నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్‌రావత్, ఆయన భార్య సహా 13 మంది మృతి చెందారు. అనన్య సామాన్యుడు బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూరు సమీపంలో జరిగిన ఘటనలో అమరులయ్యారు. ఆయనతోపాటు మరో 12 మందిని కోల్పోయినందుకు ఇప్పటికీ దుఃఖిస్తున్న భారతీయులలో చైనా అసంబద్ధమైన వ్యాఖ్యలు భారతీయుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక కూడా మరణించారు. ఈ వార్త కూడా వేలాది మందిని ఆవేదనకు గురి చేసింది. సైకాలజీలో డిగ్రీ చేసిన మధులిక ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో ఆమె మృతి తీరని లోటని కన్నీరుమున్నీరవుతున్నారు.
Mi17V5 అనేది 2012 నుండి IAFతో కూడిన అధునాతన రవాణా హెలికాప్టర్..
సాంకేతికంగా అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఇదే అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు.
సముద్రాలు, ఎడారుల పైన ఉండే ప్రతికూల వాతావరణంలో కూడా సమర్థంగా ప్రయాణం చేసే స్పెషాలిటీ ఈ హెలికాప్టర్ సొంతం. ఈ హెలికాప్టర్ల క్యాబిన్లో పన్నెండున్నర చదరపు మీటర్ల విశాలమైన స్పేస్ ఉంటుంది. బలగాలుగానీ, సామాగ్రిగానీ వేగంగా ఎక్కించడానికి, బయటికి తీయడానికి డోర్లు, రియర్ ర్యాంప్ అనుకూలంగా ఉంటాయి. పారాచూట్ ఎక్విప్ మెంట్, సెర్చ్ లైట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో పాటు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. స్లింగ్ ద్వారా ఈ హెలికాప్టర్ కు 4,500 కిలోల కార్గోను మోసుకెళ్లే కెపాసిటీ ఉంది. గ్లాస్ కాక్ పిట్ ఉంటుంది. ఇందులో అన్నిరకాలుగా పనిచేసే నాలుగు డిస్ ప్లేలు ఉంటాయి. నైట్ విజన్ ఎక్విప్ మెంట్, వాతావరణం తెలిపే రాడార్, ఆటోపైలట్ సిస్టంలాంటివి ఉండడం వల్ల పైలట్స్ పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. మనదేశం అవసరాలకోసం తయారుచేసిన ఎంఐ రకం హెలికాప్టర్లలో ప్రత్యేకంగా నేవిగేషన్, సమాచారాన్ని చూపించే డిస్ ప్లేలను ఏర్పాటు చేశారు.
దేశం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా.. ఎంతటి సవాళ్లను అయితే ధీటుగా అధిగమించే ధృఢచిత్తం ఆయన సొంతం. ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చి భారత సైనిక వ్యవస్థను తీర్చిదిద్దిన త్రినేత్రుడు బిపిన్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
సైనిక హెలికాప్టర్‌లో దుర్మరణం చెందడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఆయన జీవాయుధ యుద్దాల గురించి అప్రమత్తం చేశారు. ఇది కూడా చైనాకు నచ్చలేదనే చెప్పాలి. ప్రస్తుత కోవిడ్ సంక్షోభం ఓ జీవాయుధ యుద్దంగా ఆయన అభివర్ణించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ఆ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించింన త్రినేత్రుడు బలపరాక్రమ శాలి బిపిన్.
పిచ్చికూతలు కూయడంలో ముందుండే చైనా.. ఇదే అదునుగా అక్కడి మీడియాను ఉసిగొల్పుతోంది. అక్కడి సోషల్ మీడియా కేంద్రంగా తక్కువ చేసి మాట్లాడుతోంది. వీరుల మరణాన్ని ఎద్దేవ చేస్తోంది. కుక్క తోక వంకర అనే రీతిలో వ్యవహరిస్తోంది. భారత శక్తికి వక్రభాష్యం చెబుతోంది. బిపిన్‌కు ప్రంపచ దేశాలు సెల్యూట్ చేస్తుంటే చైనా మాత్రం తన పిచ్చి మాటలతో రెచ్చగొడుతోంది.
ఇవి కూడా చదవండి: Bipin Rawat: వీరుడా వందనం.. బిన్ రావత్ దంపతులకు ప్రముఖుల నివాళులు..