2022 Movies Release dates: వచ్చే ఏడాది సినిమాల జాతర.. ఏ మూవీ ఎప్పుడు విడుదలంటే..

తెలుగులో 2022లో విడుదలయ్యే టాప్ హీరో సినిమా తేదీలు ఇలా ఉన్నాయి. వచ్చే ఏడాది వచ్చే పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్‎తో తీస్తున్నారు. ముఖ్యంగా RRR భారీ బడ్జెట్‎తో తెరకెక్కుతున్న చిత్రం...

2022 Movies Release dates: వచ్చే ఏడాది సినిమాల జాతర.. ఏ మూవీ ఎప్పుడు విడుదలంటే..
Tollywood
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 10, 2021 | 2:26 PM

తెలుగులో 2022లో విడుదలయ్యే టాప్ హీరో సినిమా తేదీలు ఇలా ఉన్నాయి. వచ్చే ఏడాది వచ్చే పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్‎తో తీస్తున్నారు. ముఖ్యంగా RRR భారీ బడ్జెట్‎తో తెరకెక్కుతున్న చిత్రం. ఈ భారీ మల్టీస్టార్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. RRR సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ స్ల్రీన్ ప్లేలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రాణా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు జనవరి 12న విడుదల కానుంది. ఈ మూవీలో పవన్ సరసన నిత్యమీనన్ నటించారు. ప్రభాస్ సాహో తర్వాత నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా వ‌స్తోన్న ఈ సినిమాని రాధాకృష్ణ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 14న విడుదల కానుంది. అజిత్ కుమార్ నటిస్తున్న వాలిమై చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఇది డబ్బింగ్ మూవీ.

సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ వస్తున్న బంగార్రాజు సినిమా వచ్చే ఏడాది జనవరి 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగార్జున, అతని తనయుడ్ నాగచైతన్య కూడా నటించారు. ఈ సినిమాలో నాగార్జున సరసన మరోసారి రమ్యకృష్ణ యాక్ట్ చేస్తోంది. డాక్ట‌ర్ రాజశేఖ‌ర్ టైటిల్ పాత్ర పోషిస్తోన్న చిత్రం ‘శేఖ‌ర్‌’. మ‌ల‌యాళ చిత్రం ‘జోసెఫ్‌’కు ఇది రీమేక్‌. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌, పెగాస‌స్ సినీ కార్ప్ బ్యాన‌ర్స్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీనివాస్ బొగ్గారం, శివానీ, శివాత్మిక నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 26 విడుదల కానుంది.

కొరటాల శివ దర్శకత్వంలో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకుడు దర్శకత్వం వహిస్తుండడం, తొలిసారి పూర్తి స్థాయిలో రామ్‌ చరణ్‌, చిరంజీవిలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ అవనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. దీని సిక్వెల్‎గా ఎఫ్3 రానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్ర సర్కార్ వారి పాట వచ్చే ఏప్రిల్ 1న విడుదల కానుంది. వీటితో వచ్చే ఏడాది కేజీఎఫ్-2, హీరో, ఖిలాడీ, మేజర్, 18 పేజీస్, గంగుభాయ్ కత్వడి, విక్రంత్ రోణా, రామారావు ఆన్ డ్యూటీ, మాచెర్ల నియోజకవర్గం, ఆదిపురుషు విడుదల కానున్నాయి.

Movie Name Release Date
RRR Jan 07, 2022
భీమ్లా నాయకు Jan 12, 2022
వాలిమై (Dub) Jan 13, 2022
రాధే శ్యామ్ Jan 14, 2022
బంగార్రాజు Jan 15, 2022
హీరో Jan 26, 2022
శేఖర్ Jan 26, 2022
ఆచార్య Feb 04, 2022
ఖిలాడీ Feb 11, 2022
మేజర్ Feb 11, 2022
18 పేజీస్ Feb 18, 2022
గంగుభాయ్ కత్వాడి (dub) Feb 18, 2022
విక్రంత్ రోణా Feb 254, 2022
ఎఫ్3 Feb 25, 2022
రామారావు ఆన్ డ్యూటీ Mar 25, 2022
సర్కార్ వారి పాట April 01, 2022
ఎజీఎఫ్2 April 14, 2022
మచెర్ల నియోజకవర్గం April 29, 2022
ఆదిపురుష్ Aug 11, 2022

Read Also… 83 Film: దీపిక.. రణ్‏వీర్‏లకు షాక్.. కపిల్ దేవ్ బయోపిక్ పై కేసు నమోదు.. ఎందుకంటే..

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి