83 Film: దీపిక.. రణ్‏వీర్‏లకు షాక్.. కపిల్ దేవ్ బయోపిక్ పై కేసు నమోదు.. ఎందుకంటే..

టీమిండియా మాజీ సారథి.. 1983 వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 83. ఇందులో కపిల్ దేవ్

83 Film: దీపిక.. రణ్‏వీర్‏లకు షాక్.. కపిల్ దేవ్ బయోపిక్ పై కేసు నమోదు.. ఎందుకంటే..
83 Movie
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 11, 2021 | 2:26 PM

టీమిండియా మాజీ సారథి.. 1983 వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 83. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‏వీర్ సింగ్ నటించగా..  క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకునన ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు విశేషస్పందన లభించింది. ఇక విడుదలకు కొద్ది రోజుల సమయం ఉండగా.. కపిల్ దేవ్ సినిమా చిక్కుల్లో పడింది.

ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది.. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. 83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‏గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు

Also Read: రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‏లో ప్రెస్‏మీట్ లైవ్..

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు రియాక్షన్స్.. ఓ భీభత్సమంటూ..

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

Katrina Kaif: రెడ్ అండ్ గోల్డ్ లెహంగాలో మెరిసిన కత్రినా కైఫ్.. లెహంగా ప్రత్యేకతలు తెలిస్తే షాకే..