RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు రియాక్షన్స్.. ఓ భీభత్సమంటూ..

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు రియాక్షన్స్.. ఓ భీభత్సమంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 1:19 PM

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.

ఇక నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏కు అనుహ్యమైన స్పందన వస్తోంది. విడుదలైన కొద్ది సమయంలోనే మిలియన్ వ్యూస్ మార్క్ అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ విజువల్స్.. డైలాగ్స్ అదిరిపోయాయి. తమ అభిమాన హీరోలను జక్కన ప్రేక్షకుల అంచనాలకు మించి చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్, గూస్ బంప్స్ వచ్చే సనివేశాలతో ట్రైలర్ అదిరిపోయిందంటూ నెట్టింట్లో సంబరాలు చేసుకున్నరు తారక్, చరణ్ ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఓ బీభత్సం..ఇక పూర్తి ప్రభంజనం కోసం జనవరి 7 వరకూ ఎదురుచూస్తుంటాను అన్నారు చిరంజీవి.

ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. వీడియోలోని ప్రతి షాట్ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ రాజమౌళి మరో అద్భుతమైన చిత్రంతో వచ్చేశారు అంటూ ట్వీట్ చేశారు మహేష్.

Also Read: NTR: ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడో తెలుసా..

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

Pushpa: సెన్సార్ పూర్తిచేసుకున్న పుష్ప.. విడుదలకు సిద్ధమే ఇక.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..