AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: సెన్సార్ పూర్తిచేసుకున్న పుష్ప.. విడుదలకు సిద్ధమే ఇక.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

Pushpa: సెన్సార్ పూర్తిచేసుకున్న పుష్ప.. విడుదలకు సిద్ధమే ఇక.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2021 | 1:21 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో బన్నీ మొదటి సారి ఊరమాస్ లుక్‏లో కనిపించబోతుండడంతో బన్నీ ఫ్యాన్స్ ఎగ్జయింటింగ్‏గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప నుంచి వచ్చే ప్రతి అప్డేట్ క్షణాల్లో నెట్టింట్లో వైరల్ చేసేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏లో దూసుకుపోతుంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ రష్మిక మందన్న.. అల్లు అర్జున్ ప్రేయసి.. శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈరోజు ఈ మూవీ నుంచి ఊ అంటావా.. ఉహూ అంటావా అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈపాటలో సమంత కనిపించనుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‏ను పుష్ప ది రైజ్ పేరుతో ఈనెల 17న విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా పుష్ప సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఫార్మాలిటీస్ పూర్తిచేసి సెన్సార్ బోర్డ్ పుష్ప చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మొత్తానికి బన్నీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్టే. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను డిసెంబర్ 12న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‏లో జరుపుతున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Samantha: మరో అవార్డ్ అందుకున్న సమంత.. ఓటీటీలో ది బెస్ట్ ఫీమేల్ యాక్టర్..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..

Samantha: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు..

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..