Samantha: మరో అవార్డ్ అందుకున్న సమంత.. ఓటీటీలో ది బెస్ట్ ఫీమేల్ యాక్టర్..

సమంత.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత సామ్..

Samantha: మరో అవార్డ్ అందుకున్న సమంత.. ఓటీటీలో ది బెస్ట్ ఫీమేల్ యాక్టర్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 10:28 AM

సమంత.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత సామ్.. తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటుంది. అలాగే తన వరకు వచ్చిన ప్రాజెక్టులకు సామ్ ఏమాత్రం వదులుకోవడం లేదట. బాలీవుడ్..టాలీవుడ్ .. ఓటీటీ ఇలా వచ్చిన ప్రతి ఛాన్స్‏కు ఓకే చెప్పేస్తూ.. తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సామ్ మరో అరుదైన అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‍లో నటించి అద్బుతమైన నటనను కనబర్చింది సమంత. అందులో సామ్ రాజీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. తాజాగా సమంత యాక్షన్ డ్రామా సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2కు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డు అందుకున్నారు. ఆమె ముంబై వెళ్లి ఈ అవార్డుల వేడుకలో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు సామ్ నటించిన ఏమాయ చేసావే.. ఈగ, నీతానే ఎన్ వసంతం చిత్రాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది. ఇక నార్త్ లో తొలి ఓటీటీ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది సమంత. ప్రస్తుతం సామ్.. అల్లు అర్జున్.. రష్మిక మందన్నా నటిస్తోన్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల తన విడాకులు ప్రకటన గురించి స్పందించింది సామ్. విడిపోయిన తర్వాత.. తను కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని.. కానీ ఇంత బలంగా ఎలా ఉన్నానో తెలియదని చెప్పుకొచ్చింది. అలాగే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నవారిపై కూడా సామ్ స్పందించింది. తన అభిప్రాయాలు.. నిర్ణయాలు నచ్చకపోతే వదిలేయాలని.. ట్రోల్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ లీక్ ?.. మూవీతో ఫ్యాన్స్‏కు పూనకాలే అంటా..

Samantha: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!