Samantha: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు..

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నిన్న విడుదలైన ఈ ట్రైలర్‏కు విశేష స్పందన లభిస్తోంది.

Samantha: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 9:22 AM

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నిన్న విడుదలైన ఈ ట్రైలర్‏కు విశేష స్పందన లభిస్తోంది. తారక్, చరణ్ విజువల్స్ అదిరిపోయాయంటూ.. జక్కన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ట్రైలర్‏తో సినిమా ఎలా ఉండనుందనేది రివీల్ చేశాడు జక్కన్న. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. వీరిద్దరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సమంత సైతం ట్విట్టర్ ఖాతా ద్వారా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించింది. చరణ్, తారక్ ఫోటోలను వేరు వేరుగా ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్ నిజంగా పులి.. ఎన్టీఆర్ కంటిలోని ఫైర్.. ఎలాంటి.. ఫిట్ అయిన చేయగలడు అంటూ.. అలాగే చరణ్ ఫోటోను ట్యాగ్ చేస్తూ.. చరణ్ నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ చూడలేదు… ఫైర్ ఫైర్ ఫైర్ అంటూ ట్వీట్ చేసింది. సామ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ పై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Anchor Ravi: షణ్ముఖ్‏తో ఇలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్ అనేశాడు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్..

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!