Anchor Ravi: షణ్ముఖ్‏తో ఇలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్ అనేశాడు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్..

యాంకర్ రవి.. బిగ్‏బాస్ హౌస్ నుంచి అనుహ్యాంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. టాప 3లో ఉండాల్సిన రవి ఎలిమినేట్

Anchor Ravi: షణ్ముఖ్‏తో ఇలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్ అనేశాడు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్..
Anchor Ravi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2021 | 1:25 PM

యాంకర్ రవి.. బిగ్‏బాస్ హౌస్ నుంచి అనుహ్యాంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. టాప 3లో ఉండాల్సిన రవి ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. అయితే రవిని ముందు నుంచే ఇన్ఫ్లుయేన్సర్.. గుంటనక్క.. ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. అయితే రవి .. ఎవరినైనా ఇన్ఫ్లుయేన్స్ చేస్తాడని ముందుగా చెప్పింది మాత్రం షణ్ముఖ్. అయితే చివరి వరకు అతనితో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించాడు రవి. కానీ షణ్ముఖ్.. అతడిని దూరం పెడుతూనే వచ్చాడు.

అయితే ఇంట్లో ఉన్న సమయంలో పట్టించుకోని షణ్ముఖ్, సిరిలు రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఓవర్ పర్ఫా్మెన్స్ స్టార్ట్ చేశారు. రవి మిస్ యూ.. నీకోసమే గేమ్ ఆడుతున్నాం.. గివ్ అప్ ఇవ్వమంటూ తెగ నటించేశారు. ఏకంగా సిరికి రవి కలలోకి వచ్చేశాడంటూ కెమెరాల ముందు తెగ ఏడ్చేసింది సిరి. రవిని చాలా మిస్సవుతున్నా అంటూ సీరియల్ యాక్టింగ్‏ను మించేసింది. ఇక ఒకర్ని తొక్కేయడానికి ఎంతకైనా తెగిస్తాడని.. ఎవర్నైనా బ్యాడ్ చేస్తాడని.. పెద్ద ఇన్ఫ్లుయేన్సర్ అని.. ఫిటింగ్స్ పెడతాడంటూ ముందు నుంచి ఆరోపణలు చేసిన షణ్ముఖ్ మాత్రం రవి ఎలిమినేట్ అయిన తర్వాత నీకోసమే ఆడుతున్నా అంటూ ఓవర్ పర్ఫామెన్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల రవి.. బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు వేరు.. ఆడియన్స్ చూస్తున్నది వేరు అంటూ షణ్ముఖ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. రవి మాట్లాడుతూ.. షణ్ముఖ్ చెప్తే వింటాడు.. కానీ టైం తీసుకుంటాడు. అది మూడు గంటలే కావచ్చు.. మూడు రోజులే కావచ్చు. ఆ తర్వాత అనలైజ్ చేసుకుని వచ్చి ఓపెన్ అవుతాడు. షణ్ముఖ్ కు నాకు మధ్య జరిగింది ఏంటంటే.. నేను ఓరేయ్ నువ్వు నాకు కనెక్ట్ అయ్యావు రారా అంటే.. ఐ నీడ్ టైం.. ఐ నీడ్ టైం అంటూ వెళ్లిపోయేవాడు. ఉన్నవి వందరోజులే .. రారా అంటే.. టైం కావాలని అడిగేవాడు. నాకు ఇంట్లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్‏లతో మంచి బాండింగ్ ఉంది. సన్నీతో సెపరేట్ బాండ్..ఇద్దరం యాంకరింగ్ నుంచి రావడం వలన కామిక్ టైమింగ్ జెల్ అయ్యింది. కానీ అది టెలికాస్ట్ కాలేదు. ఇంట్లో వాళ్లంతా తెగ ఎంజాయ్ చేశారు.

సన్నీ వచ్చి బావా కంటెంట్ ప్లాన్ చేద్ధాం అంటే చెప్పేవాడిని. సేమ్ ఇలాగే షణ్ముఖ్‏తో కూడా చెప్పాను.. కానీ నాకు ఇన్ఫ్లోయెన్సర్ అని పేరు పెట్టేశాడు. మంచి చెప్తుంటే ఇలా అంటున్నాడేంటీ అనుకునేవాడిని. బిగ్ బాస్ ఇంట్లో మీకు తెలియని చాలా జరిగాయి. ఆడియన్స్ ఏది చూపించాలో అది చూపించలేదు.. ఆడియన్స్ ను తప్పుదోవ పట్టింటే కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో నెట్టింట్లో హంగామా అవుతుంది. బిగ్ బాస్ ప్రమోషన్స్ అవుతుంది అన్నట్టుగానే టెలికాస్ట్ చేస్తున్నారు. శ్రీరామచంద్ర తన పాయింట్ చెప్పేసి వెళ్లిపోతాడు.. అలాగే ఎప్పుడూ పాటలు పాడతాడు. కానీ అవేం టెలికాస్ట్ చేయలేదు అంటూ చెప్పుకోచ్చాడు రవి.

Also Read: Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!