Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొంటున్నారా..! దాని ఇన్సూరెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్‌ చేయండి..

Vehicle Insurance: కరోనా మహమ్మారి వల్ల చాలామంది పబ్లిక్‌లో తిరగడానికి ఇష్టపడటం లేదు. అందుకే సొంత వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొంటున్నారా..! దాని ఇన్సూరెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్‌ చేయండి..
Second Hand
Follow us
uppula Raju

|

Updated on: Dec 10, 2021 | 2:42 PM

Vehicle Insurance: కరోనా మహమ్మారి వల్ల చాలామంది పబ్లిక్‌లో తిరగడానికి ఇష్టపడటం లేదు. అందుకే సొంత వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. మధ్య తరగతి ప్రజలు కూడా వైరస్‌కి భయపడి వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే వ్యాపారులు వీరి అవసరాన్ని గుర్తించి సరైన పత్రాలు లేని వాహనాలు, ఇన్సూరెన్స్‌ లేని వాహనాలను అంటగడుతున్నారు. అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. అందుకే సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్‌ చెక్ చేయడం తప్పనిసరి. అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ప్రారంభంలో OLX-క్రిసిల్ ఆటో స్టడీ ప్రకారం.. భారతదేశంలో ప్రీ-ఓన్డ్ మార్కెట్ 2025-26 నాటికి 70 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. ఇది 12 శాతం నుంచి 14 శాతం వృద్ధి రేటుగా మారుతుంది. ఇప్పుడు ప్రజలు ఎక్కువ శాతం సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలపై ఆధారపడుతున్నారు. కాబట్టి వాహనం వివరాలను, చరిత్రను తెలుసుకోవడం అవసరం. ఈ వివరాలు చాలా ముఖ్యం కానీ వ్యాపారులు కస్టమర్ల దృష్టి మరల్చి వాహనాలను అంటగడుతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి వాహనం విక్రయించేటప్పుడ వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ వివరాలను కచ్చితంగా తెలియజేయాలి. ఒకవేళ వాహనం గురించి మీకు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో చెక్ చేయాలి.

1. http://www.uiic.in/vahan/iib_query.jspకి వెళ్లాలి. 2. కింది వివరాలను నమోదు చేయాలి. * వెహికిల్‌ నెంబర్‌ * ఇంజిన్ నంబర్ 3. సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి 4. తర్వాత మీరు వాహనం గురించిన వివరాలను యాక్సెస్ చేయగలుగుతారు. అవేంటంటే.. * ఇన్సూరెన్స్‌ నంబర్ * ఇన్సూరెన్స్‌ ప్రస్తుత స్థితి * ఇన్సూరెన్స్‌ వ్యవధి * ఇన్సూరెన్స్‌ గడువు తేదీ 5. క్లెయిమ్ రకం, క్లెయిమ్ తేదీ, దావా కారణం (మొత్తం నష్టం లేదా దొంగతనం దావా) మొదలైన గత వివరాలు తెలుస్తాయి. 6. మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేస్తుంటే తప్పకుండా ఈ వివరాలు తెలుసుకోండి.

Twitter: ట్విట్టర్‎లో టిక్‎టాక్ లాంటి వీడియో ఫీచర్..! పరీక్షలు నిర్వహిస్తోన్న సంస్థ..

Multibagger: లక్ష రూపాయలు ఆరు నెలల్లో రూ.32 లక్షలయ్యాయి.. మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్ ఎంటో తెలుసా..

Tata Motors: వాహన ధరలను పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి అమలులోకి.. ఎంత పెరుగుతాయంటే..