Multibagger: లక్ష రూపాయలు ఆరు నెలల్లో రూ.32 లక్షలయ్యాయి.. మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్ ఎంటో తెలుసా..

Multibagger stock: కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ కొత్త గరిష్ఠాలను తాకింది. మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్‌లు దాదాపు నాన్-పార్టీసిపెంట్స్‌గా మిగిలిపోయాయి....

Multibagger: లక్ష రూపాయలు ఆరు నెలల్లో రూ.32 లక్షలయ్యాయి.. మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్ ఎంటో తెలుసా..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 10, 2021 | 12:34 PM

Multibagger stock: కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ కొత్త గరిష్ఠాలను తాకింది. మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్‌లు దాదాపు నాన్-పార్టీసిపెంట్స్‌గా మిగిలిపోయాయి. అయితే ఇటీవలి మార్కెట్ ర్యాలీలో 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో మంచి సంఖ్యలో రియల్ ఎస్టేట్ స్టాక్‌లు ప్రవేశించాయి. రాధే డెవలపర్స్ షేర్ వీటిలో ఒకటి. ఈ మల్టీబ్యాగర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్. గత ఆరు నెలల్లో అప్పర్ సర్క్యూట్‌ను తాకుతుంది. గత వారంలో రాధే డెవలపర్స్ షేరు ధర రూ.309.60 నుంచి రూ.338లకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.190 నుండి రూ.338కి పెరిగింది. ఈ కాలంలో 77 శాతం పెరిగింది. అదేవిధంగా గత ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 10.40 నుండి రూ.338కు చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 3,150 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

రాధే డెవలపర్స్‎లో ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు ఈరోజు 1.09 లక్షలకు చేరుతుంది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పటి రూ. 1.77 లక్షలకు చేరేది. అలాగే ఒక పెట్టుబడిదారుడు ఆరు నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లైతే దాని విలువ ఇప్పుడు రూ.32.50 లక్షలకు చేరింది.

Read Also.. Rakesh Jhunjhunwala: ఆ IPOలో పెట్టుబడి పెట్టిన మదుపరులకు షాక్.. రాకేష్ ఝున్‎ఝున్‎వాలాను నమ్మి..