Tata Motors: వాహన ధరలను పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి అమలులోకి.. ఎంత పెరుగుతాయంటే..
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కార్ల ధరలను పెంచింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది...
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కార్ల ధరలను పెంచింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు వాహనాల ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు, వస్తువులు ఇతర ఖర్చుల ధరలు పెరుగుతున్నందున, వాహనాల ధరలను పెంచడానికి తాము ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని టాటా మోటార్స్ తెలిపింది.
జనవరి 1 నుంచి టాటా వాహనాల ధరలు 2.5 శాతం పెరగనున్నాయి
నివేదికల ప్రకారం దేశీయ వాహన కంపెనీ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను జనవరి 1 నుండి 2.5 శాతం పెంచబోతోంది. కమోడిటీ ధరలు పెరగడం, ముడిసరుకు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. వాణిజ్య వాహనాల ధరల పెంపు నిర్ణయం అన్ని వర్గాలకు వర్తిస్తుందని కంపెనీ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాలు, ఇంటర్మీడియట్, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న వాణిజ్య వాహనాలు, బస్సుల ధరలు కూడా పెరగనున్నాయి.
టాటా మోటార్స్ కంటే ముందు, దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడి కూడా వచ్చే నెల నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మిగతా కంపెనీలు కూడా ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. నేడో రేపో ఆ కంపెనీల నుంచి ప్రకటన రావొచ్చు.